Home > Politics > నీటి సమప్య తీరినతరువాతే ఓట్లు అడుగుతా : లోకేష్

నీటి సమప్య తీరినతరువాతే ఓట్లు అడుగుతా : లోకేష్

జగన్ యాత్రకు మైలేజ్ ఎక్కడ
ఎన్నికలకు గులాబీ కసరత్తులు

nara-lokesh-apduniaస్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా తాగునీటి సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకే మంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత, 2019 నాటికి రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చెయ్యాలి అని లక్ష్యంగా పెట్టుకున్నానని మంత్రి లోకేష్ అన్నారు. శనివారం నాడు అయన కాకినాడ రూరల్ మండలంలో పర్యటించారు. గోదావరి జలాలు శుద్ధి పరిచి, సూర్యారావు పేట తో పాటు మరో 16 గ్రామాలకు సురక్షిత తాగునీటీ సరఫరా పథకాన్ని అయన ప్రారంభించారు. రూ 15 కోట్ల రూపాయిల వ్యయంతో ఈసమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని నిర్మించారు. మంత్రి మాట్లాడుతూ రాజధాని లేకుండా నాలుగో సారి మనల్ని కట్టుబట్టలతో బయటకి గెంటేసారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చెయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు ఎక్కువుగా కేటాయిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటి ని అందించాలి అనే లక్ష్యంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ చేపడుతున్నాం. 22 వేల కోట్లు అంచనా వ్యయంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ చేపడుతున్నామని అన్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రతి ఇంటికి కులాయి ద్వారా తాగునీటిని అందించేందుకు 2,300 కోట్లు ఖర్చు చేయ్యబోతున్నామని తెలిపారు. మొదటి దశ గా 10 వేల కోట్లు సమీకరించి వాటర్ గ్రిడ్ పథకం పనులు ప్రారంభిస్తున్నాం. గతంలో పాలకులు జిఓలు ఇచ్చారే తప్ప పనులు చెయ్యలేదు. పెండింగ్లో ఉన్న గ్రామీణ నీటి సరఫరా పనులు అన్ని వెంటనే పూర్తి చెయ్యాలి అని ఆదేశాలు జారీ చేసానని వెల్లడించారు. ఓవర్ హెడ్ ట్యాంక్స్ లో సెన్సార్లు ఏర్పాటు చేసి నీటి నాణ్యత పర్యవేక్షించబోతున్నాం. ఓవర్ హెడ్ ట్యాంక్స్ మరమ్మతుల కోసం 45 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కరించిన తరువాతే మీ ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com