Home > Politics > రెండేళ్లలో ప్రతిఇంటికి కుళాయి నీళ్లు : మంత్రి లోకేష్

రెండేళ్లలో ప్రతిఇంటికి కుళాయి నీళ్లు : మంత్రి లోకేష్

చంద్రబాబుతో లగడపాటి సమావేశం
చిన్నారెడ్డిపై దాడిని ఖండించిన మల్లు రవి

naralokesh-apduniaపల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడుకి సేవ చేసినట్టే అని పెద్దలు చెప్పారు.పల్లెటూరికి సేవ చేసే అవకాశం నాకు చిన్న వయసులోనే వచ్చిందని మంత్రి లోకేష్ అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట బహిరంగ సభలో అయన ప్రసంగించారు. 16 వేల కోట్లు లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడినప్పుడు జీతాలు అయినా ఇవ్వగలమా అనే అనుమానం నాకు కలిగింది. కానీ అపార పాలనా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారి వలన ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా పరిపాలన చేస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చెయ్యని విధంగా రైతు రుణమాఫీ చేసాం, డ్వాక్రా రుణమాఫీ చేసి చూపించాం. .డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సిన మరో 4 వేలు కూడా వడ్డీ తో సహా చెల్లిస్తామని అన్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 658 కిలోమీటర్ల సి.సి రోడ్లు నిర్మాణం చేస్తే ఒక్క శృంగవరపుకోట లొనే 171 కిలోమీటర్ల సి.సి రోడ్లు నిర్మాణం జరిగిందని అయన వెల్లడించారు. రెండు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 4500 కోట్లతో లింక్ రోడ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. 2019 లోపు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటి ని అందిస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో పోటీ పడలేక ప్రతిపక్ష పార్టీ ప్రజల మధ్య కులం,మతం,ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *