Home > Politics > యువమంత్రి పెట్టబడుల వేట

యువమంత్రి పెట్టబడుల వేట

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు : కేవీపీ
బాలయ్యకు గుడివాడ... హిందూపురానికి లోకేశ్

naralokesh-apduniaనవ్యాంధ్రను ఐటీ రంగంలో మేటిగా నిలబెట్టేందుకు మంత్రి లోకేశ్ తీవ్రంగా కృషిచేస్తున్నారు. వారంరోజుల పాటూ అమెరికాలో పర్యటించిన ఈ యువమంత్రి దక్షతపై అక్కడి కంపెనీలు విశ్వాసముంచాయి. పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అగ్రిమెంట్లు కుదుర్చుకున్నాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ వచ్చే ఏడాదిలో లక్ష ఐటీ ఉద్యోగాల కల్పనే తన ధ్యేయమంటున్నారు. సవాళ్ల మయమైన ఆంధ్రప్రదేశ్ ను అన్నిరంగాల్లో అభివృద్ధి పథాన నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. సీఎం వారసత్వాన్నే అందిపుచ్చుకున్నారు ఆయన తనయుడు.. మంత్రి.. లోకేశ్. రాష్ట్రాన్ని ఐటీ రంగంలో మేటిగా తీర్చిదిద్దేందుకు యువ మంత్రి చేయని ప్రయత్నంలేదు. ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా పలు ఐటీ కంపెనీలను ఒప్పించడమే ధ్యేయంగా సాగిన లోకేశ్ అమెరికా టూర్ విజయవంతమైంది. ఎన్నారైలతో పాటూ అనేక సంస్థలు నవ్యాంధ్రలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు.

అమెరికా పర్యటనలో ప్రభుత్వ పనితీరును, రాష్ట్రానికి ఉన్న సానుకూలతలను హైలెట్ చేశారు లోకేశ్. 67 ఏళ్ల వయస్సులో 24 ఏళ్ల యువకుడిలా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని అన్నారు. ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల కంపెనీలో ఒకటైన కియ రాష్ట్రానికి వచ్చిందని చెప్పారు. ఇక ఐటీ రంగానికి నిపుణులైన మానవవనరులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పిన లోకేశ్ బ్లాక్‌చైన్‌, ఫింటెక్‌ లాంటి టెక్నాలజీలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఎన్‌ఆర్‌ఐలు సహకరించాలని కోరారు. కేవలం ఐటీ రంగంపైనే కాక ఫార్మా విభాగంపైనా లోకేశ్ దృష్టి పెట్టారు. అమెరికా పర్యటనలో భాగంగా పలు ఫార్మా కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఐటీ రంగం అభివృద్ధికి అమలు చేస్తున్న పద్ధతిలోనే ఫార్మా రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా లోకేశ్‌ వివరించారు. ఫార్ములేషన్‌, పరిశోధన, అభివృద్ధి నైపుణ్య శిక్షణ కోసం ఇంక్యుబేటరీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బల్క్‌ డ్రగ్‌ అభివృద్ధి కోసం విశాఖపట్నంలో ఫార్మాపార్క్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మౌలికవసతులు, ఇంక్యుబేటరీ, ఫార్మాపార్క్‌ ఏర్పాటుచేస్తే రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నామని అక్కడి ఫార్మా కంపెనీల ప్రతినిధులు చెప్పారు. త్వరలోనే పూర్తిస్థాయి ప్రణాళికలతో వస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *