Home > Politics > తెలుగులో మాట్లాడిన ప్రధాని

తెలుగులో మాట్లాడిన ప్రధాని

మీ మనోభావాలు సరే... ప్రజల సంగతేంటి
వైసీసీలో అంతర్గత సంక్షోభం

modi-kcr-narasimhan-apduniaమెట్రో రైలు, జీఈసీ సదస్సు ల కోసం హైదరాబాద్ చ్చిన ప్రధాని నరేంద్రమోదీకి ఘన స్వాగతం లభించింది. మంగళవారం మద్యాహ్నం ఢిల్లీ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆయన నగరానికి వచ్చారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తరువాత అయన బేగంపేటలో విమానాశ్రయంలోనే కాసేపు బీజేపీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్రెడ్డి, కృష్ణంరాజు తదితరులు హాజరయ్యారు. సభలో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘సోదర సోదరీమణుల్లారా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. దాదాపు ఒక్క నిమిషం పాటు ఆయన తెలుగులో మాట్లాడారు. తర్వాత హిందీలో ప్రసంగాన్ని కొనసాగించారు. అభివృద్ధి విషయంలో ఎవరిపట్ల వివక్ష చూపబోమని, సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నేడు ప్రపంచం దృష్టిని హైదరాబాద్ ఆకర్షించిందన్నారు. భారతమాత సేవకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని, ఈ ఘనత కార్యకర్తలకే దక్కుతుందన్నారు. తెలంగాణ విమోచనంలో అమరులైన వీరులకు జోహార్లు తెలిపారు. హైదరాబాద్ అంటే సర్దార్ పటేల్ గుర్తుకొస్తారని తెలిపారు. దేశ వ్యాప్తంగా కమలం వికాసం కోసం కృషి చేస్తోన్న బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. తనకు ఘన స్వాగతం పలికిన ప్రతి బీజేపీ కార్యకర్తకు తన ధన్యవాదాలు తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *