Home > Editorial > జీహెచ్ఎంసీలో కొత్త మార్పులు…?

జీహెచ్ఎంసీలో కొత్త మార్పులు…?

కోర్టుల తీర్పుతోనైనా కళ్లు తెరవాలి
సుప్రీం తీర్పుతో నైనా మార్పు వచ్చేనా...

ghmc-apduniaగ‌తేడాది ఆర్ధిక ఇబ్బందులు, ప‌లు స‌మ‌స్యల‌తో స‌త‌మ‌త‌మ‌యిన బ‌ల్ధియా…కొత్త ఏడాదిలో స‌రికొత్తగా క‌నిపిం చ‌నుంది. ఇదే విష‌యాన్ని అధికార వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. సాంకేతిక‌త‌తో పాటు, ప‌లు కొత్త అంశాలతో ప్ర‌జ‌ల ముందుకు జీహెచ్ఎంసీ రానుంద‌ని అధికారులు,పాల‌క‌వ‌ర్గం చెబుతోంది. గ‌తేడాది ఎదుర్కొన్న స‌మ‌స్యల‌ను దృష్టిలోపెట్టు కుని స‌రైన అంచ‌నాల‌తో ముందుకు వ‌స్తామంటోంది జీహెచ్ఎంసీ. స్వచ్చ్ భార‌త్‌తోపాటు, ఫుట్‌పాత్‌ల‌పై ఆక్రమణల తొల‌గింపు, స్వైపింగ్ మిష‌న్‌ల వినియోగం…ఇలా కొత్త పుంత‌లు తొక్కనుంది జీహెచ్ఎంసీ.

ఇప‌టివ‌ర‌కూ ఉన్న జీహెచ్ఎంసీ..కొత్త సంవ‌త్సరంలో ఉండబోతోన్న జీహెచ్ఎంసీకి మ‌ధ్య తేడా మీరే చూస్తారుగా అంటోంది జీహెచ్ఎంసీ యంత్రాంగం. అందుకు త‌గ్గ ప‌లు అంశాల‌తో, విప్లవాత్మక మార్పుల‌తో ముందుకు రావ‌డానికి సిద్ధమ‌వుతోంది. స్వచ్ఛ్ స‌ర్వేక్షణ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీహెచ్ఎంసీ…మెరుగైన ర్యాంక్ కోసం ప్రయ‌త్నాలు ప్రారంభిం చింది. ఇందులో భాగంగా కార్పోరేట్ సంస్థల‌ను భాగ‌స్వాముల‌ను చేసేందుకు రంగం సిద్ధం చేసింది. స్వచ్ఛ భార‌త్ స్ఫూర్తిగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యక్రమంలో భాగ‌స్వాములు కావ‌డానికి ప‌లు ప్రముఖ కంపెనీలు, సంస్థలు జీహెచ్ఎంసీకి పెద్ద ఎత్తున ఆర్థిక స‌హాయాన్ని అంద‌జేస్తున్నాయి. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్‌బులిటీ కింద జిహెచ్ఎంసీకి భారీ ఎత్తున నిధులు అందించాయి …ఇటీవ‌లే ఎల్ బీ స్టేడియంలో జ‌రిగిన స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవ‌గాణ కార్యక్రమంలో రాంకీ సంస్థ రెండు కోట్ల రూపాయ‌లు, కామినేని సంస్థ కోటి రూపాయ‌లు, ఆంధ్రాబ్యాంకు 25 ల‌క్షల రూపాయ‌లు ట్రీగార్డ్‌ల ఏర్పాటు చెక్కుల‌ను అంద‌జేసింది.

ఇదే విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద‌రాబాద్ మొద‌టి ద‌శ‌లో మూడు ఈ-టాయిలెట్ల ఏర్పాటుకు అంగీ కారం తెల‌ప‌గా, కిమ్స్ హాస్పిట‌ల్ రెండు ఈ-టాయిలెట్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఇక హ‌డ్కో సంస్థ 1.10కోట్లు, ఎన్‌.ఎం.డి.సి ఐదు ఈ-టాయిలెట్ల ఏర్పాటుకు ఐటీసీ సంస్థ వంద కేంద్రాల ద్వారా డ్రైవేస్ట్ సెంట‌ర్ల ఏర్పాటు, గోద్రేజ్ సంస్థ ప‌ది కేంద్రాల ద్వారా డ్రైవేస్ట్ సెంట్ల ఏర్పాటు, ఎన్‌.టి.పి.సి సంస్థ ఐదు స్వచ్ఛ ఆటోటిప్పర్లను ఉచితంగా అందించ‌డానికి అంగీ కారం తెలిపాయి. మ‌రికొన్ని కార్పొరేట్ సంస్థలు ఈ ఆర్థిక స‌హాయాన్ని, వ‌స్తు రూపెణ స‌హాయాన్ని అంద‌జేయ‌డానికి అంగీ కారం తెలుపుతున్నారు. వీటితో పాటు న‌గ‌రంలో శాని టేష‌న్ రంగంలో క్రమం త‌ప్పకుండా చెత్త సేక‌రిస్తున్న స్వచ్ఛ ఆటో ఆప్పర్లు గార్బెజ్ క‌లెక్టర్లతో పాటు ప్రతిరోజు స్వచ్ఛ ఆటోల‌కు చెత్తను అందించే మ‌హిళ‌ల‌కు న‌గ‌దు లేదా బంగారంరూపంలో ప్రోత్సాహ‌క‌ బ‌హుమ‌తులు అందించ‌డానికి ప‌లు సంస్థల నుండి స్పాన్సర్లను జీహెచ్ఎంసీ ఆహ్వానించింది.

వీటితో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహ‌ణ‌లో జీహెచ్ఎంసీకి స‌హ‌కారం అందిం చ‌డంతో పాటు క్రమం తప్పకుండా ఇంటింటి నుండి చెత్త త‌ర‌లించే ఆటో రిక్షాలు, త‌డి, పొడి చెత్తను వేర్వేరుగా సేక‌రించే కార్మి కులు, చెత్తను బ‌హిరంగంగా వేయ‌కుండా స్వచ్ఛ ఆటోల‌కు అందించే గృహిణీల‌కు ప్రత్యేక బ‌హుమ‌తుల‌ను అంద‌జే యాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. విధి నిర్వహ‌ణ‌లో నిబద్దతను పాటించే పారిశుధ్య సిబ్బంది, మున్సిప‌ల్ చ‌ట్టాలు, నిబంధ‌న‌లను గౌర‌వించి అమ‌లుచేసే పౌరుల మంచిని ప్రోత్సహించే చ‌ర్యల్లో భాగంగా ఈ బ‌హుమ‌తులను అంద‌జేయాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్దన్‌రెడ్డి నిర్ణయించారు. న‌గ‌దు లేదా బంగారం రూపంలో ఉండే ఈ బ‌హుమ‌తులను జీహెచ్ ఎంసీ నిధుల‌తో కాకుండా స్థానికంగా ఉండే ప్రముఖ వ్యాపార, కార్పొరేట్‌, ప్రైవేట్‌, స్వచ్ఛంద సంస్థలచే జీహెచ్ఎంసీ అందించ‌ నున్నది. ఇందుకు గాను ఈ బ‌హుమ‌తుల‌ను స్పాన్సర్‌చేసే సంస్థల‌ను ఆహ్వానిస్తున్నామ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌ జ‌నార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మ‌హి ళ‌ల‌కు ఇస్తున్న ప్రోత్సాహ‌కాల మాదిరిగానే న‌గ‌రంలో చెత్త సేక‌ర‌ణ‌, వేర్వేరుగా చేయ‌డం ద్వారా స్వచ్ఛ కార్యక్రమాల‌ను స‌మ‌ర్థవంతంగా చేప‌ట్టే వారికి కూడా న‌గ‌దు లేదా బంగారంతో కూడిన బ‌హుమ‌తుల‌ను స‌ర్కిళ్లు, వార్డుల వారిగా అంద‌జేయాల‌ని నిర్ణ యింన జీహెచ్ఎంసీ. స‌ర్కిళ్లవారిగా ఈ బ‌హుమ‌తుల‌ను అంద‌జేయాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణయించి, ఎంత మొత్తంలో న‌గ‌దు బ‌హుమ‌తులు లేదా బంగారం రూపంలో ఇచ్చే విష‌యంపై త్వర‌లోనే నిర్ణయం తీసుకోనున్నారు.

దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత మరింత వేగంగా నగదు రహిత సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేం దుకు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున స్వైపింగ్ యంత్రాలను సమకూర్చుకుంటోంది. నగదు రహిత పన్న చెల్లింపు లను ప్రోత్సహించేందుకు బంపర్ బహుమ తులను అందించిన జీహెచ్ఎంసీ… నీతి ఆయోగ్ ను సైతం ఆకర్షించింది. ఈ చెల్లింపుల్లో దేశంలోనే ప్రభుత్వ సంస్థలతో పాటు అన్ని కార్పొరేషన్ల లోనూ జీహెచ్ఎంసీ ముందు భాగాన నిలిచింది. దీంతో … మరింత విస్తృతంగా నగదు రహిత సేవలను అందించేందుకు… బల్దియా నిర్వహి స్తున్న 19 సిటిజన్ సర్వీస్ కేంద్రా ల్లోనూ స్వైపింగ్ యంత్రాలను ప్రవేశపెడుతున్నారు. డెబిట్ , క్రెడిట్ కార్డుల ద్వారా బల్దియాకు పన్నులు చెల్లించే పౌరులు ఈ విధానం ద్వారా నగదు రహిత సేవలు వినియోగించుకోవచ్చు. గ్రేటర్ పరిధిలో పనిచే స్తున్న350 మంది బిల్ కలెక్టర్లుకు కూడా త్వరలో బల్దియా స్వైఫింగ్ యంత్రాలు సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది.
వీటితో పాటు న‌గ‌రంలోని ప్రముఖ ప‌ర్యాట‌క స్థలాలు,ప్రధాన వ్యాపార కూడ‌ళ్లలో అత్యంత ఆధునిక ఈ-టాయి లెట్లను ఏర్పాటు చేయాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దేశంలోని అతికొద్ది న‌గ‌రాల్లో నిర్వహ‌ణ‌లో ఉన్న ఈ-టాయిలెట్లను హైద‌రాబాద్ న‌గ‌రంలోని 15ప్రాంతాల్లో మొద‌టి ద‌శ‌లో జ‌న‌వ‌రి 26వ తేదీలోగా ఏర్పాటు చేయ‌డానికి చ‌ర్యలు ప్రారంభిం చింది. ఈ-టాయిలెట్లను కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా ఏర్పాటు చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద‌రాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ శాంత‌న్ ముఖ‌ర్జి, ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ ప్రతినిధుల‌తో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ప్రత్యేకంగా స‌మావేశమ‌య్యారు. సీఎస్ఆర్‌లో భాగంగా ఈ-టాయిలెట్లను ఏర్పాటు చేయ‌డానికి ఎస్‌.బి.హెచ్ ఎండి సూత్రప్రాయంగా అంగీక‌రించారు.మ‌హిళ‌ల‌కు, పురుషుల‌కు వేర్వేరుగా ఏర్పాటుచేసే ఈ ఈ-టాయిలెట్లకు గాను టెండ‌ర్ ప్రక్రియ‌ను కూడా జీహెచ్ఎంసీ

ఇక ఇన్ని మార్పుల‌తోపాటు ఖాదీ ప‌రిశ్రమ‌ను ప్రోత్సహించేలా ప్రతి సోమ‌వారం జీహెచ్ఎంసీలోని ప్రతి అధికారి కాట‌న్ దుస్తుల‌ను ధ‌రించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు జీహెచ్ఎంసీ క‌మీష‌న‌ర్. ఇన్ని మార్పుల‌తో పాటు మ‌రిన్ని కొత్త విష‌యాల‌తో న‌గ‌ర ప్రజ‌ల మ‌న‌సు దోచుకుంటామంటోన్న జీహెచ్ఎంసీ క‌ళ‌ను సాకారం చేయాలంటే ప్రజల స‌హ‌కారం కూడా కావాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *