Home > General > కోడి గుడ్లతో కొత్త చిక్కులు

కోడి గుడ్లతో కొత్త చిక్కులు

కౌంటర్‌ ఇచ్చిన స్మృతి
కనువిందు చేస్తున్న తుంగభద్ర తీరం

egg-apduniaమధ్యాహ్నా భోజన పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తున్న కోడి గుడ్లు కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి. కాంట్రాక్టరు సరఫరా చేస్తున్న గుడ్లలో కొన్ని చెడిపోవడంతో వాటిని సేవిస్తున్న విద్యార్ధులు అస్వస్థతకు గురవుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు ఉదాసీత వీడకుంటే మధ్యాహ్నా భోజన పథకం పూర్తిగా పక్కదారి పట్టే ప్రమాదం ఉందని, విద్యార్ధుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. పొన్నూరు అర్బన్‌, రూరల్‌ ఏరియాల్లో 92 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి వారానికి 17,439 కోడి గుడ్లను కాంట్రాక్టరు సరఫరా చేయాల్సి ఉంది. గతంలో వారానికి రెండు గుడ్లు మాత్రమే ఇచ్చేవారు. కాగా ఈ మధ్య కాలం నుంచి వారానికి మూడు చొప్పున అందజేస్తున్నారు. వారంలో కచ్చితంగా మూడు గుడ్లు ఇవ్వాల్సిందే. ప్రభుత్వ పాఠశాలలకు చైల్డ్‌ ఇన్‌ఫో ప్రకారం కాంట్రాక్టరు కోడిగుడ్లు సరఫరా చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టరు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు చెడిపోతున్నాయనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు గుడ్డు సైజు కూడా చిన్నదిగా వస్తుందనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా అవుతున్న కోడిగుడ్ల నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యలపై ఎంఈవో రుద్రపాటి శోభాచంద్‌ స్పందించారు. పాడైన కోడిగుడ్లు విద్యార్ధులకు అందుతున్నట్లు స్వయంగా తెలుసుకున్నానని చెప్పిన శోభాచంద్ ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిబంధనలు పాటించాల్సిందే అని స్పష్టం చేశారు. కోడిగుడ్లు తీసుకున్నప్పుడే వాటిని నీటిలో వేసి పరీక్షించాలని చెప్పారు. చెడిపోయిన గుడ్లు పైకి తేలతాయని, అలాంటి వాటిని తీసుకోకూడదని అన్నారు. చెడిపోయిన వాటిని కాంట్రాక్టరుకు ఇవ్వకుండా ధ్వంసం చేయాలని చెప్పారు. గుడ్డు బరువు 40గ్రాముల లోపు ఉంటే తిరస్కరించాలని చెప్తున్న అధికారులు వారానికి సరిపడా గుడ్లు మాత్రమే తీసుకోవాలని హెడ్‌మాస్టర్లకు సూచిస్తున్నారు. రెండు వారాలకు కలిపి ఒకేసారి ఇస్తామన్నా తీసుకోవద్దని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com