Home > Movies > సైరా కు కొత్త కష్టాలు

సైరా కు కొత్త కష్టాలు

కోటి హృదయాలను మీటిన పాట...
రవి తేజ కొత్త మూవీ..అ..అ..ఆ

saira-chiranjeevi-apduniaరాజ‌కీయాల వైపు అడుగుప‌డ్డ చిరంజీవి ఎనిమిది సంవ‌త్స‌రాల పాటు తెలుగు సినిమాకు దూరంగా ఉన్నారు. చివ‌ర‌కు త‌న 150వ చిత్రం ఖైదీ నెంబ‌రు 150తో మ‌రోసారి త‌న స్టామీనాను ప్రూవ్ చేసుకున్నారు. అంతేకాకుండా రాంచ‌ర‌ణ్ కూడా నిర్మాణం రంగంలోకి ఇదే సినిమాతో అడుగుపెట్టి హిట్ సొంతం చేసుకున్నారు. 151 వ సినిమాను రాంచ‌ర‌ణ్ తాను నిర్మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. అంతేకాకుండా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌కుడిగా నియ‌మించి ప్రాజెక్ట్‌ను అప్ప‌గించారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాకుండా ఓ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి క‌థ‌ను తెర‌కెక్కించే ప‌నిలో భాగంగా సురేంద‌ర్ రెడ్డి చిరు కోసం ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ సిద్దం చేశాడు. సైరా పేరుతో చ‌క‌చ‌క ప‌నులు జ‌రిగిపోతున్నాయి. ఫస్ట్ లుక్‌, టీజ‌ర్ విడుద‌ల చేశారు. సైరా క్యారెక్ట‌ర్‌లో చిరంజీవి ఆక‌ట్టుకునేలా క‌నిపించారు. వీర న‌ర‌సింహారెడ్డి బ్రిటీషు సైన్యంపై యుద్దం చేసిన స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు. ఆయ‌న జీవితచ‌రిత్ర‌ను ఆధారం చేసుకొని సినిమా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుద‌ల‌వుతే అన్‌టోల్డ్ స్టోరీ సిద్దం అవుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. అయితే తాజాగా న‌ర‌సింహారెడ్డి ఓ బందిపోట‌ని, ప్రజ‌ల ఆస్తులు కొల్ల‌గొట్టాడంటూ నెట్టం శ్రీనివాస‌రావు అనే వ్యక్తి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దొంగ జీవితాన్ని సినిమాగా తీసి స‌మాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తారంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. వెంట‌నే ప్రాజెక్ట్ ఆపేసి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై నీలి నీడ‌లు అలుముకున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేసుకొని షూటింగ్ కూడా మొద‌లుపెట్టాక అడ్డంకి ఎదురురావ‌డం మెగా ఫ్యామిలీని క‌ల‌వ‌ర‌పెడుతుంద‌ట‌. వాస్త‌వానికి స‌బ్జెక్ట్ అనుకోగానే న‌ర‌సింహారెడ్డికి సంబంధించిన జీవిత క‌థ‌ల‌తో సురేంద‌ర్ రెడ్డి అనేక పుస్త‌కాల‌ను తిర‌గేసిన‌ట్టు చెప్పాడు. వాటిలో పొందుప‌ర్చిన విష‌యాల‌తోనే స్క్రిప్ట్ సిద్దం చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. మ‌రి త‌ప్పు ఎక్క‌డ జ‌రిగింది అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. నిజంగానే న‌ర‌సింహారెడ్డి బందిపోటా లేదా స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడా అనే విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించి సినిమాను యూనిట్ ఎలా ముంద‌కు తీసుకువెళుతుందో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *