Home > General > 9వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

9వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

ఇల్లు కొనుగోలు చేసే వారికి వరం "రెరా"
కాన్పూర్ లో ఆస్థి కలాశ్ బ్యాంక్

telangana-police-apdunia-నోటిఫికేషన్ విడుదల చేసిన పోలీస్శాఖ
-సివిల్ విభాగంలో 1810 కానిస్టేబుల్ పోస్టులు
-ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో 2760 పోస్టులు
-ఎస్ఏఆర్సీపీఎల్లో 56, టీఎస్ఎస్పీలో 4065
-ఎస్పీఎఫ్లో 174, ఫైర్లో 416 పోస్టుల భర్తీ
-ఈ నెల 11 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు
-ఏప్రిల్ 3న ప్రిలిమినరీ పరీక్ష

తెలంగాణలో భారీ సంఖ్యలో పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలకు నోటిఫికేషన్ వెలువడింది. పోలీస్ నియామకాలు భారీ స్థాయిలో చేపడ్తామని సీఎం కే చంద్రశేఖర్రావు ఇచ్చిన హామీ నేపథ్యంలో కొత్త సంవత్సర కానుకగా 9281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పోలీస్శాఖ గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో సివిల్ విభాగంలో 1810 కానిస్టేబుల్ పోస్టులు, ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో 2760 పోస్టులు, టీఎస్ఎస్పీలో 4065 పోస్టులు కూడా ఉన్నాయి. సివిల్ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మూస నియామక పద్ధతులకు స్వస్తి చెప్తూ ప్రిలిమినరీ పరీక్ష, తర్వాత సాధారణ దేహదారుఢ్య పరీక్ష, అనంతరం మెయిన్స్ నిర్వహించి నియామకాలు చేపట్టనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఆన్లైన్లో  దరఖాస్తులు.. :
జనవరి 11నుంచి ఫిబ్రవరి 4 వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లోనే దరఖాస్తు చేసుకోవాలని, తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్సైట్లో సంబంధిత వివరాలను చూడవచ్చని రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్రావు తెలిపారు. మరిన్ని వివరాల కోసం తమ వెబ్సైట్ సందర్శించాలని కోరారు. ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.200 ఫీజు ఉంటుందని, మీ సేవ, ఈసేవ, టీఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్, పేమెంట్ గేట్వేద్వారా ఫీజు చెల్లించవచ్చని ఆయన తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష ఏప్రిల్ 3న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

పూర్తిగా మారిన నియామక పద్ధతులు
మూడేండ్ల వయో పరిమితి పెంచడంతోపాటు నియామక పద్ధతులను పూర్తి స్థాయిలో మార్చినట్టు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్రావు తెలిపారు. ఐదు కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్ల పరుగు పందెం రద్దు చేశామని వెల్లడించారు. ముందుగా ప్రిలిమినరీ రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షల్లో ఓసీ అభ్యర్థులు 40%, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30% మార్కులు సాధిస్తే సాధారణ అర్హత పొందుతారు. ఈ నియామకాల్లో సివిల్ విభాగంలో 33%, ఏఆర్, ఎఫ్పీబీ, కమ్యూనికేషన్ విభాగంలో 10% మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది. పురుషుల విభాగంలో నిర్వహించే ఐదు దేహదారుఢ్య పరీక్షల్లో మూడింటిలో ఉత్తర్ణీత సాధించాలని సూచించారు. మహిళలు మూడింటికిగాను రెండింటిలో ఉత్తర్ణీత సాధించాల్సి ఉంటుంది. పురుషుల విభాగంలో 800 మీటర్ల పరుగు పందెం, మహిళలకు 100 మీటర్ల పరుగుపందెం తప్పనిసరి. మహబూబ్నగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గిరిజన అభ్యర్థులకు ఛాతి, ఎత్తు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. జనరల్ విభాగంలో పోటీపడే పురుష అభ్యర్థుల ఎత్తు 167.6 సెంటీమీటర్లు ఉండాలి. ఛాతి 86.3 సెంటీమీటర్ల నుంచి ఊపిరి పీల్చినప్పుడు ఐదు సెంటిమీటర్లు పెరిగేలా ఉండాలి. మహిళ అభ్యర్థులకు ఎత్తు 152.5 ఉండాలి. ఎస్టీ పురుష అభ్యర్థులకు ఎత్తు 160 సెంటీమీటర్లు, ఛాతి 80సెంటీమీటర్లు, ఊపిరి పీల్చితే 3 సెంటిమీటర్లు పెరిగేలా ఉండాలి. మహిళ అభ్యర్థులకు ఎత్తు 150 సెంటీమీటర్లు సరిపోతుంది. చాకచక్యం, తెలివితేటలకు సంబంధించి చివరగా మరో పరీక్షను నిర్వహిస్తారు. పర్సనాలిటీ టెస్ట్ పేరిట రాత పరీక్ష ఉంటుంది. సామాజిక స్థితిగతులు, తెలంగాణ హిస్టరీపై ప్రశ్నలు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *