Home > Editorial > నితీశ్ పిల్లిమొగ్గలు …

నితీశ్ పిల్లిమొగ్గలు …

సోవరిన్ బంగారం బాండ్ల పధకం మార్గదర్శక సూత్రాల సవరణకు మంత్రివర్గ ఆమోదం
పరిష్కార దిశలో రేషన్ డీలర్ల సమస్యలు
 
 bjp maha_apduniaబీజేపీ ఒక్కో రాష్ట్రంలో పావులు కదుపడం మొదలైంది. బీహార్‌లో మహాఘట్ బంధన్‌ను చీల్చడం కూడా మోదీ- అమిత్ షా వ్యూహమనే అభిప్రాయం కలుగుతున్నది. బీజేపీ వ్యూహం ఏమైనప్పటికీ, విలువలతో నిమిత్తం లేకుండా అధికారం కోసం నితీశ్ వేస్తున్న పిల్లి మొగ్గలు మాత్రం సమర్థనీయం కాదు. నితీశ్ రాజకీయ చరిత్ర, ఆయన ఎత్తుగడలు గమనిస్తే విలువలకు కట్టుబడి లేదా ఆవేశంతో రాజీనామా చేశారని అనిపించదు. అవసరార్థం పొత్తులు కుదుర్చుకుంటూ అధికారంలో కొనసాగడంలో నితీశ్ దిట్ట. బీహార్‌లో నితీశ్‌కు స్వయంగా విస్తృత రాజకీయ పునాది లేదు. సొంత సామాజికవర్గం కూడా చాలా చిన్నదే కాకుండా, అంతగా రాజకీయ ప్రాబ ల్యం ఉన్నది కాదు. సొంతంగా ఎన్నికలలో గెలి చే బలం లేకున్నా ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకొని అడుగులు వేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం కూడా ఆచితూచి తీసుకున్నదే.తేజస్వి యాదవ్‌పై కేసులు పెట్టడం, దానిని కారణంగా చూసి నితీశ్ పొత్తును విచ్ఛిన్నం చేసుకోవడం వెనుక మోదీ- అమిత్ షా వ్యూహం ఉన్నదా  అనుమానం కలుగుతోంది. లోక్‌సభ ఎన్నికలలో 
మోదీ ప్రభంజనం బలంగా వీచిన నేపథ్యంలో బీహార్‌లో బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌తో సహా లౌకిక పార్టీలు ఎంతో చర్చించి మహాఘట్‌బంధన్‌ను ఏర్పరచాయి. బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యూ) అధినేత నితీశ్ కుమార్  గవర్నర్‌ను కలిసి తన పదవికి రాజీనామా సమర్పించడంతో అధికార కూటమి అయిన మహాఘట్‌బంధన్ కుప్పకూలిపోయింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ కుమారుడు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ పదవికి రాజీనామా చేయాలని నితీశ్ కొద్ది రోజులుగా కోరుతున్నారు. అయినా తేజస్వి తన పదవిలో కొనసాగుతుండటంతో తన అసంతృప్తిని అనేక విధాలుగా వ్యక్తం చేశారు. జూన్ 20న ఆదాయపు పన్ను శాఖ అధికారులు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలోని ఆరుగురిపై నేరారోపణ చేశారు. తేజస్వి యాదవ్‌తో సహా మరో ఐదుగురి పేర ఉన్న ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నితీశ్ ఎంత కోరినప్పటికీ తన కుమారుడు తేజస్వి రాజీనామా చేయడానికి ఆర్‌జేడీ నేత లాలూ ప్రసాద్ అంగీకరించలేదు. తమపై కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని లాలూ 
కుటుంబం ఆరోపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ రంగంలోకి దిగి లాలూ, నితీశ్ మధ్యరాజీ కుదుర్చడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.  వారం రోజులుగా సం క్షోభం తీవ్రస్థాయికి చేరుకొని ఏ క్షణాన్నయినా అధికార కూటమి కూలిపోవచ్చునని తెలుస్తూనే ఉన్నది. ఈ సంక్షోభానికి పరాకాష్టగా నితీశ్ తన పదవికి రాజీనామా సమర్పించారు. లాలూ ప్రసాద్ లేదా బీజేపీ మద్దతు ఇస్తే తప్ప నితీశ్ కుమార్ అధికారం కొనసాగించడం కష్టం.లాలూ కుమారుడు తేజస్వి యాదవ్‌పై అవినీతి ఆరోపణలు రావడం వల్లనే విలువలకు కట్టుబడి తాను రాజీనామా చేసినట్టు నితీశ్ చెప్పుకుంటున్నారు. బీజేపీ బిహార్‌లో బలమైన నాయకుడైన లాలూ ను దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్న దశలో నితీశ్ ఆ పార్టీతో చేతులు కలిపి అధికారం చేపట్టారు. కొంతకాలం తరువాత బీజేపీ మతతత్వ పార్టీ అంటూ పొత్తు ఒదులుకున్నారు. 
ఒడిశాలో నవీ న్ పట్నాయక్ బీజేపీతో పొత్తు వదిలి సొంతం గా అధికారం కైవసం చేసుకున్నట్టుగా తాను కూడా సొంత ప్రతిష్ఠతో గెలువగలనని నితీశ్ భావించారు. కానీ నవీన్ పట్నాయక్ తండ్రి బీజూ పట్నాయక్ ఒకప్పుడు ఒడిశాలో బలమైన నేత. ఆ రాజకీయ పునాది నవీన్ పట్నాయక్‌కు కలిసివచ్చింది. ఇందుకు భిన్నంగా నితీశ్ 2014 లోక్‌సభ ఎన్నికలలో ఒంటరిగా పోటీచే సి ఘోర పరాజయం పొందారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలలో మహా కూటమి ఏర్పరుచుకొని లాలూతో కలిసి పోటీచేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ విధంగా అటూఇటూ దుంకు తూ పన్నెండేండ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఎన్నికల పొత్తు పెట్టుకున్నప్పుడు లాలూ ప్రసాద్ అవినీతి నేపథ్యం నితీశ్‌కు తెలియంది కాదు. ఎన్నికల ముందు ఒప్పందంలో భాగంగానే తేజస్వి యాదవ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి లభించింది. ఇంతకాలం లాలూ ప్రసాద్ 
నేతృత్వంలోని ఆర్‌జేడీతో పొత్తు కొనసాగించిన నితీశ్ ఇప్పు డు హఠాత్తుగా అవినీతిని సహించబోనని చెప్పుకోవడం ఆశ్చర్యకరమే.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అవగాహన కుదుర్చుకున్న తరువాతనే నితీశ్ లాలూ కుమారుడు తేజస్వి మంత్రివర్గం నుంచి వైదొలగాలనే డిమాండ్ ముందు పెట్టారనే అభిప్రాయం బలంగా ఉన్నది. రాష్ట్రపతి ఎన్నికలలో కూడా నితీశ్ లౌకిక కూటమి అభ్యర్థి, బీహార్ బిడ్డ అయిన మీరా కుమార్‌కు కాకుండా, బీజేపీ అభ్యర్థి అయిన రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇచ్చారు. లాలూ కుటుంబీకులు అవినీతి మచ్చలేని స్వచ్ఛమైన నాయకులని చెప్పలేం. బీహార్‌లో మహాఘట్ బంధన్‌ను చీల్చడం కూడా మోదీ- అమిత్ షా వ్యూహమనే అభిప్రాయం కలుగుతున్నది. బీజేపీ వ్యూహం ఏమైనప్పటికీ, విలువలతో నిమిత్తం లేకుండా అధికారం కోసం నితీశ్ వేస్తున్న పిల్లి మొగ్గలు మాత్రం సమర్థనీయం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *