Home > General > నెల్లూరు డాక్టర్లు మారరా…..

నెల్లూరు డాక్టర్లు మారరా…..

కొండెక్కిన గుడ్డు
విజయవాడకు దీపికా పడుకొనే

nellore-apduniaఈ మధ్యే తెలుగులోకి విడుదలైన తమిళ సినిమా అదిరిందిలో మొదటి 10నిమిషాల సీన్ నెల్లూరులో జరిగింది. ఇప్పుడు అదే హైలెట్ అయ్యింది. రోగికి ట్రీట్ మెంట్ సమయంలో నర్సుల ఫోన్ సంభాషణలు, డాక్టర్ల లేటుగా వచ్చి రోగి చనిపోయిందంటూ చెప్పటం లాంటి సీన్లు ఇప్పుడు నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో హైలెట్ గా మారాయి.నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్లు నిర్లక్ష్యం రోజురోజుకూ తారాస్థాయికి చేరుతుంది. కడుపులో కత్తెర పెట్టి కుట్టిన ఘటన మరువక ముందే 11 నెలల చిన్నారిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనలో చిన్నారి తల్లిదండ్రులు అడుగుతున్న ప్రశ్నలు తాజాగా వచ్చిన అదిరింది సినిమా సీన్లుతో ముడిపడి ఉంది.నెల్లూరు నగరంలోని వైఎస్సార్ నగర్ కు చెందిన మహేష్ అనే ఆటో డ్రైవర్ తన 11 నెలల చిన్నారిని హాస్పటలకు తీసుకొచ్చాడు. కడుపు ఉబ్బిందని హాస్పటల్ కు తీసుకొస్తే వైద్యులు, నర్సులు నిర్లక్ష్యంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ట్రీట్ మెంట్ చేస్తున్నామంటూ హడావుడి చేసి సరైన సమయంలో వైద్యం అందించకపోవడంతో తమ చిన్నారి చనిపోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.చిన్నారి తల్లిదండ్రులు హృదయవిదారకంగా రోదిస్తూ వారు అడుగుతున్న ప్రశ్నలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. సెలైన్ పెట్టే నర్సుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని.. వచ్చినా కూడా ఎప్పుడూ ఫోన్లు మాట్లాడుకుంటూ, వారు పనికూడా సక్రమంగా చేయడం లేదని ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నర్సులు బాధ్యతారాహిత్యం అలా ఉంటే… వైద్యులు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండకపోవడంతో తమ పాప తమకు దూరంగా వెళ్లిపోయిందని వారు రోదిస్తున్నారు.డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులకు కఠినంగా శిక్షించాలంటున్నారు. ట్రీట్ మెంట్ సమయంలో సంబంధిత బంధువులకు కూడా సరైన సమాధానం చెప్పడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న తమకు పుట్టిన బిడ్డను డాక్టర్లు పొట్టనపెట్టుకున్నారని, వైద్యం చేయలేమని ముందే చెప్పుంటే కార్పొరేట్ హాస్పటల్స్ తీసుకెళ్లి తమ బిడ్డను ప్రాణాలతో దక్కించుకునేవాళ్లమని ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *