Home > Editorial > నినాదాలకే పరిమితమవుతున్నరోడ్డు భద్రతా ప్రమాణాలు

నినాదాలకే పరిమితమవుతున్నరోడ్డు భద్రతా ప్రమాణాలు

ఆర్థికవృద్ధి దిశగా అడుగులు
సామాజిక బాధ్యత మరిచిపోవద్దని సుప్రీం చురకలు

road-accidents-apduniaరోడ్డు ప్రమాదాలు సాధారణమయిపోయాయి. ఏటా ప్రమాదాల్లో మరణిస్తున్న వారి కంటే రెట్టింపు స్థాయిలో ప్రమాదాల కారణంగా వికలాంగులుగా మారుతున్నారు. చివరికి రోడ్డు భద్రతా నిజంగా రహదారులపై ఏటా దాదాపు ఐదు లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా లక్షన్నర మందికిపైగా ఈ ప్రమాదాలలో మరణించడం పట్ల న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ రహదారులపైనే కాదు, నగరాలలోని సాధారణ బాటలపై కూడా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. అతి వేగాన్ని నియంత్రించడం, కార్లకు, ద్విచక్రవాహనాలకు వేర్వేరు దారుల ఏర్పాటు, పాదచారులకు ప్రత్యేక దారి మొదలైన చర్యలను స్వీడన్‌లో తీసుకుంటున్నారు. యూరప్ నగరాలలో పాదచారుల వాహనాలు రావడాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. ప్రభుత్వ చర్యలకు తోడు ప్రజలకు కూడా నియమ నిబంధనలు, జాగ్రత్తలను నూరిపోసినప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి. . మద్యం దుకాణాలకు మళ్ళా లైసెన్సులను పునరుద్ధరించకుండా ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఈ దుకాణాలను బందు పెట్టాలని ఆదేశించింది. రహదారులపై మద్యం దుకాణాలను ఎత్తివేయించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు నెల రోజులలోపే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించింది. మద్యపానమే ప్రమాదాలకు ప్రధాన కారణమనే అభిప్రాయానికి న్యాయస్థానం వచ్చింది. ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలంటూ పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు ఎంత కృత నిశ్చయంతో ఉన్నదో తెలుస్తున్నది. రహదారులకు కనీసం ఐదు వందల మీటర్ల లోపు వరకు మద్యం దుకాణాలు ఉండకూడదని, లోపలి వైపున దుకాణం ఉన్నట్టు బోర్డులు కూడా పెట్టకూడదని స్పష్టం చేసింది. నిజానికి రహదారి ప్రమాదాలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవలిసింది. కానీ పదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం నిరాసక్తంగా వ్యవహరించడం వల్లనే తాము కల్పించుకోవలసి వస్తున్నదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా రహదారి ప్రమాదాలను నివారించాలనే స్పృహ పెరిగిపోతున్నది. 2011-20 ని రహదారి భద్రతా కార్యాచరణ దశాబ్దంగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. రహదారి భద్రతపై రెండవ అంతర్జాతీయ సమావేశం బ్రెజిల్ రాజధాని బ్రెసీలియాలో జరిగింది. రహదారి ప్రమాదాలను 2020 నాటికి సగానికి తగ్గించాలని, 2030 సుస్థిరాభివృద్ధి కార్యక్రమంలో ఇది భాగం కావాలని బ్రెసీలియా ప్రకటన పేర్కొన్నది. అభివృద్ధి చెందిన దేశాలలో వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఆ దేశాలలో ప్రమాదాలు తక్కువ. రహదారి ప్రమాదాలలో గాయపడిన వారిని మొదటి గం టలో ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తే సగం మంది బతికేవారని న్యాయ కమిషన్ 2006లో ఇచ్చిన నివేదికలో పేర్కొన్న ది. ప్రమాదం జరిగిన తరువాత మొదటి గంట కాలాన్ని గోల్డెన్ అవర్‌గా పేర్కొంటారు. ఆలస్యం అయ్యే కొద్దీ క్షతగాత్రులు మరణించే పరిస్థితికి దారితీస్తుంది. దవాఖాన నుంచి అంబులెన్స్ వచ్చి వారిని దవాఖానకు చేర్చడానికి చాలా సమయం పట్టవచ్చు. దారినపోయే వారు కొంచెం చొరవ తీసుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తే వారికి పునర్జన్మ ఇచ్చినట్టవుతుంది. కానీ పుణ్యానికి పోతే పాపమెదురైనట్టు, తాము అనవసరంగా కేసులలో ఇరుక్కుంటామనే భయంతో చాలామంది ప్రమాదస్థలి దగ్గరే ఉండి కూడా చొరవ తీసుకోరు. అందువల్ల గాయపడిన వారికి తోడ్పడే పరోపకారి పాపన్నలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భరోసా ఇచ్చేందుకు మార్గదర్శక సూత్రాలు జారీ చేయాలని కూడా సుప్రీం కోర్టు గతంలోనే ఆదేశించింది. క్షతగాత్రులను చేర్చుకునేటప్పుడు, దవాఖానలు కాపాడిన వారిని ఫీజు చెల్లించమని అడగకూడదు. ఇబ్బంది పెట్టే విధంగా ప్రశ్నలు అడుగకూడదు. వారిని పోలీసులు వేధించకూడదు. వారిని సాక్షి గా మారమని ఒత్తిడి తేకూడదు. వారు స్వయంగా సాక్ష్యం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే ఒకసారి మాత్రమే సాక్ష్యం తీసుకోవాలె. పదేపదే తిప్పించుకోకూడదు. సాక్షి వివరాల విషయంలో గోప్యతను పాటించాలె. ఈ మేరకు కేంద్రం గత జనవరిలో మార్గదర్శక సూత్రాలను జారీ చేసిం ది. కానీ ఇటువంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయడంతో సరిపోదు. కాపాడిన వారిని అభినందించాలే తప్ప ఏ మాత్రం ఇబ్బంది పెట్టినా మళ్ళా అదే నిరాసక్తత పెరిగిపోతుంది. పోలీసులు, దవాఖాన సిబ్బంది వ్యవహరించే తీరులో స్పష్టమైన మార్పు రావాలె. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ప్రాణాలను కాపాడిన వారికి ప్రోత్సాహకం ఇచ్చే విధంగా, వేధించిన అధికారులపై చర్య తీసుకునే విధంగా కూడా చట్టా లు చేయాలనే వాదనలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి సూచనలను పరిశీలించాలి.స్వీడన్ వంటి దేశాలు రహదారి ప్రమాదాల నివారణకు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి మన దేశంలో ప్రవేశపెట్టాలె. జాతీయ రహదారులపైనే కాదు, నగరాలలోని సాధారణ బాటలపై కూడా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలె. అతి వేగాన్ని నియంత్రించడం, కార్లకు, ద్విచక్రవాహనాలకు వేర్వేరు దారుల ఏర్పాటు, పాదచారులకు ప్రత్యేక దారి మొదలైన చర్యలను స్వీడన్‌లో తీసుకుంటున్నారు. యూరప్ నగరాలలో పాదచారుల దారిలోకి వాహనాలు రావడాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. ప్రభుత్వ చర్యలకు తోడు ప్రజలకు కూడా నియమ నిబంధనలు, జాగ్రత్తలను నూరిపోసినప్పుడే ప్రమాదాలు తగ్గుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *