Home > Bhakti > యాదాద్రిలో లక్ష మంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు

యాదాద్రిలో లక్ష మంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు

2 నుంచి ‘దివ్య దర్శనం’
టీటీడీలో 447 అర్చక, పరిచారిక పోస్టుల భర్తీకి వినతి
 
yadadri temple_apduniaయాదాద్రి అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది యాదాద్రి లక్ష్మీ నరసింహుని సన్నిధిలో  ఆరు అంతస్తులతో కూడిన మూడు అపార్ట్ మెంట్లు నిర్మించనున్నారు. విష్ణు పుష్కరిణిని అభివృద్ధి చేయడంతోపాటు అన్నప్రసాదానికి, డార్మిటరీ, విశ్రాంతి ప్రాంగణాలు నిర్మించనున్నారు.లక్ష మంది భక్తులు వచ్చినా స్వామి వారి దర్శనం సులభంగా కల్పించే తీరుతో ప్రత్యేక సముదాయం నిర్మాణం. బస్సు టెర్మినల్‌ నుంచి క్యూకాంప్లెక్స్‌కు చేరే భక్తులకు తగు వసతులు. దైవదర్శనానికి వెళ్లే భక్తులకు అందులోనే పూజ, ప్రత్యేక దర్శనాల టికెట్లు విక్రయించే కౌంటర్లు ఉంటాయి. ఒక్కో కాంప్లెక్స్‌లో ఆరు వేల మంది భక్తులు కూర్చోవచ్చు. భక్తిభావం కల్పించే ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగుతాయి. ఎప్పటికప్పుడు దర్శన సమాచారం అందిస్తారు. ప్రధాన ఆలయం.. దర్శన వరుసల సముదాయం మధ్య గుహ లాగా దారిని నిర్మిస్తారు. స్వయంభువుల దర్శనానికి వెళ్లాలంటే ఆ గుహ నుంచి వెళ్లాల్సిందే. నరసింహుడి 32 రూపాలను ఆ మార్గంలో పొందుపరిచే ప్రణాళిక సిద్ధమవుతోంది.దర్శన వరుసల్లో ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. పిల్లలు, వృద్ధులే కాకుండా భక్తులు ఎవరికైనా ఆ సదుపాయం సమకూరనుంది.విమానాశ్రయాన్ని తలపించేలా బస్సు టెర్మినల్‌ నిర్మిస్తున్నారు. షాపులతో పాటు వాహనాల పార్కింగ్‌కు సెల్లార్లు నిర్మిస్తారు. ఐదు అంతస్థులతో ఏర్పాటయ్యే సెల్లార్‌లో మూడు వేల కార్లను పార్కింగ్‌ చేయొచ్చు.దివ్యదర్శనం చేసుకున్న భక్తులకు అన్నప్రసాదాన్ని ఉచితంగా అందజేసేందుకు ఇంకో సముదాయంలో ప్రత్యేక వసతి కల్పించనున్నారు. పిల్లల ఆటస్థలం, ముఖ్యులకు దర్శన మార్గాలు, వృద్ధుల సేదకు విశ్రాంతి ప్రాంగణాలు ఏర్పాటవుతాయి.వ్రతాలు జరిపేందుకు విశాలమైన మండపాలు, దీపారాధన ప్రాంగణాలు, విశ్రాంతి, దుకాణాల ప్రాంగణాలను నిర్మిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు అనుగుణంగా సముదాయాల నిర్మాణం చేపట్టాలన్న సూచనలతో నమూనాలు త్వరలోనే తుదిరూపు దాల్చనున్నాయి. వీటి నిర్మాణాలకయ్యే వ్యయ అంచనాలపై యాడా దృష్టిసారించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *