Home > Editorial > స్కిల్‌ డెవలప్ మెంట్ కోర్సులపై కాన రాని శ్రద్ధ

స్కిల్‌ డెవలప్ మెంట్ కోర్సులపై కాన రాని శ్రద్ధ

సి`మెంట్‌ `మంటలే...
కరోనా కథ కంచికేనా..?
 
skills_apduniaవృత్తి విద్య-ఉపాధికి భవిత” అనే నినాదానికి తెలుగు రాష్ట్రాల్లో అర్థం మారి పోయింది. తెలుగు రాష్ట్రాల్లో “స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు”, జాబ్ ఓరియెంటెడ్ కోర్సులమీద పాలకులు దృష్టి పెట్టలేదు.
చదువులు చదివే స్థోమత లేని పేద గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగురేఖలు నింపవలసిన పాలిటెక్నిక్ కళాశాలలు నిరుద్యోగుల ఉత్పత్తి కేంద్రా లుగా అవతారం ఎత్తాయి. మారిన కాలం లో వృత్తిశిక్షణా కోర్సులు మారాయి. బజారులో డిమాండ్ ఉన్న కోర్సుల్ని ప్రవేశ పెట్టి, తగిన శిక్షణ ఇచ్చి డిప్లమో హోల్డర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాల్సిన సంస్థలు, విధి నిర్వహణలో వైఫల్యం చెందాయి. ఒకప్పుడు ‘పది’పాసైన వెంటనే కామన్ ఎంట్రన్స్ పరీక్ష రాసి సీటు పొందిన వారు 3 ఏళ్లు చదివితే ఉద్యోగం వచ్చేది. ఇపుడు ఎన్ని డిప్లమోలు చేసినా బజారు కవసరమైన ‘స్కిల్’ లేకుండా పోయింది. ఎన్నో కొత్త ‘పరిశ్రమలు’ వచ్చాయి. కడుపు నింపే చదువు చెప్పాలి. తన కాళ్ళపై తాను నిలబడగల్గే ట్రైనింగ్ చేయాలి. అన్ని సౌకర్యాలు ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలకే అడ్మిషన్లు ఇవ్వాలి. పుట్టగొడుగుల్లా, వచ్చిన 
సంస్థలమీద, అక్రమాలు చేస్తూ, అసౌకర్యాలతో కాలేజీలు నడుపు తున్న వారిమీద ఆల్‌ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు ఆకస్మిక తనిఖీలు చేసి కొరడా ఝళిపించాలి. ఒక్క సెక్షన్ లిమిటెడ్ స్ట్రెంగ్త్‌కే ఏ సౌకర్యాలు లేని ప్రైవేటు, సర్కారు పాలిటెక్నిక్ కాలేజీల్లో అదనపు సెక్షన్ల పేరిట ఒక్కో గూపుల్లో 60 నుండి 240 దాకా సీట్లు పెంచటం నిరుద్యోగులకు ఉపాధిని, శిక్షణను లేకుండా చేయటం కాదా. పాలిటెక్నిక్ మైనింగ్ కోర్సుల్లో 60 సీట్ల స్థాయికే ఎలాంటి సదు పాయాలులేవు. పాఠాలు చెప్పేవారు లేరు. మైనింగ్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు లేవు. సింగరేణి గనుల్లో ప్రతిఏటా శిక్షణ పొందని వారికి ప్రైవేటు కాలేజీలు మైనింగ్ డిప్లమో ఇస్తే వారు ఎలా డ్యూటీ చేస్తారు? కొత్తగూడెం, మంచిర్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో చదివే విద్యార్థులకు మైనింగ్, వొకేషనల్ ట్రైనింగ్ ప్రతి ఏటా ఇచ్చి బావుల్లో, గనుల్లో ప్రమాదాలు జరుగ కుండా అధికారులు కృషి చేస్తున్నారు. గత కాంగ్రెస్ హయాంలో ఉన్న 120 మైనింగ్ సీట్లను 3600 కు పెంచుకున్నారుహైదరాబాద్ జిల్లాలో మైన్స్ లేకపోయినా 60 సీట్లకు, నల్గొండజిల్లాలో 2400 సీట్లకు, మెదక్ జిల్లాలో 120 సీట్లకు అను మతి ఇచ్చి, నాలుగు బ్యాచ్‌లు నడుపుకొని లక్షాధికారులు అయ్యారు. ఒకపుడు వెయ్యిలోపు ఉన్న పాలిటెక్నిక్ సీట్లు, రాజకీయ నాయ కుల కాసుల కోసం 2013-14 నాటికి  45వేలకు పెంచారు. కేవలం కళాశాల పెట్టి ‘డబ్బు’ సంపాదించటానికి అధికార, ప్రతిపక్షపార్టీల ప్రజాప్రతినిధు లు అడ్డగోలుగా కొత్త కాలేజీలు, కొత్తకోర్సులకు అనుమతి పొందారు. 10సంవత్సరాలనుండి కొత్త ఫాకల్టీ రిక్రూట్ మెంట్ లేదు. పాడుబడ్డ భవనాల్లో సర్కారు కాలేజీలు నడిపిస్తున్నారు. సాంకేతిక విద్యకు కొత్త సొగసులు దిద్దుతామన్న సిఎం మాట పత్తాలేదు. సమీక్ష లేదు. తనిఖీ 
లేదు. ప్రజలకు అందుబాటులో ఉండటా నికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలుగల, సర్కారు పాలిటెక్నిక్ కాలేజీలను ప్రతి జిల్లా, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో వెంటనే ఏర్పాటు చేయాలి. తెలంగాణలో పార్లమెంటు నియోజకవర్గంగా 20 ఏళ్లనుంచి, మరో 30ఏళ్ల నుంచి శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న పెద్దపల్లికి ప్రభుత్వ పాలిటెక్నిక్ లేదు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పారిశ్రామిక ప్రాంతం పెద్దపల్లి జిల్లాలో ఉంది. సింగరేణి గనులు, ఎన్‌టిపిసి, కేసోరాం ఫ్యాక్టరీ వంటి ఎన్నో పరిశ్రమలు ఉన్న పెద్దపల్లి జిల్లాలో సర్కారు పాలిటెక్నిక్ కావాలి. తెలంగాణలో అయితే  కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి జిల్లా కేంద్రానికి 
కొత్త సర్కారు పాలిటెక్నిక్‌ను మంజూరు చేశారు కొత్తగా 21జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రలో 60 సర్కారు పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా 150 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. ఒక్కో జిల్లా లో 4 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ఆయా జిల్లాల్లో ఉన్న వనరులు, ఇండస్ట్రియల్ అవసరాలను బట్టి మంజూరు చేయాలి. ఉన్న  మూడు చొప్పున ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు అసౌకర్యాలు అరకొర సిబ్బందితో నడుస్తున్నాయి. ఒకప్పుడు ‘లక్ష’కు ఒక మైనింగ్ సీటును మేనేజ్‌మెంట్ కోటా కింద అమ్ము కున్నవారు ఇపుడు క్లాసుకు రాకపోయినా, ఒరిజినల్ టిసి, మెమో జిరాక్స్ ఇవ్వమని అడిగితే ప్రైవేటు పాలిటెక్నిక్ కోర్సు’కు అని పాడుకుంటూ విద్యార్థులు పరుగెత్తుతునారు. కన్వీనర్ కోటా సీట్లు 15 శాతం ఖాళీ ఉండగా, మేనేజ్‌మెంట్ సీట్లను గత సం॥ ఎవరు పట్టించు కోలేదు. అఖిల భారత విద్యా సాంకేతిక శిక్షణ సంస్థ, వారు ప్రైవేటు 
పాలిటెక్నిక్‌లకు ముకుతాడు వేయాలని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్న సెకండ్ షిప్టు పాలిటెక్నిక్ కోర్సులను నిలిపి వేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ప్రభుత్వమే సర్కారు డిప్లమో సంస్థలను పటిష్టపరచి, శిక్షణ పూర్తికాగానే ఉపాధి, ఉద్యోగం సాధించే విధంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com