Home > Crime > 250 వెబ్ సైట్లకు నోటీసులు

250 వెబ్ సైట్లకు నోటీసులు

ఆరుషి హత్యకేసులో హైకోర్టు సంచ‌ల‌న తీర్పు
ఉరి శిక్ష రద్దుపై పిల్

websites-apduniaఆ తార ఎవరితో పడుకుందో తెలుసా. ఈ నటి అతనితో గడిపింది. మరో యాంకర్ అన్నింటిని వదిలేసింది. ఇలా ఇష్టమొచ్చినట్లు వైబ్ సైట్లల్లో రాస్తున్నారు. దీనికి హద్దు పొద్దు లేదు. మసాలా జోడించి మరీ చూపిస్తున్న తీరు ఆశ్చర్యమేస్తోంది. వారు నీళ్లు ఉన్నాయని చెప్పిన చోట కనీసం బురద ఉండటం లేదు. ఫలితంగా సినీ ప్రముఖులు ఈ వెబ్ సైట్లతో విసిగిపోయారు. అందుకే సినీ తారలను అశ్లీలంగా చూపిస్తున్నారన్న ఫిర్యాదుపై సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సినీ వెబ్‌సైట్లపై కేసు నమోదు చేసిన పోలీసులు వాటి యాజమాన్యాల పై చర్యలకు దిగుతున్నారు. సినీతారల చిత్రాలను తారుమారు చేసి, వారిపై లేనిపోని కథనాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఫొటోలను మార్ఫింగ్ చేయడం, అసభ్యంగా చూపించడం, నగ్న దృశ్యాలను జోడించడం వంటి పనులు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. అలా వారి దృశ్యాలను ప్రసారం చేయడం ద్వారా కొన్ని సినీ వెబ్‌సైట్లు నటుల పరువుకు భంగం కలిగిస్తున్నాయని చెప్పారు. అలాంటి వెబ్‌సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ప్రాథమిక దర్యాప్తు జరిపిన సైబర్‌ పోలీసులు పదుల సంఖ్యలో వెబ్‌సైట్లపై కేసులు నమోదు చేసి వేట ప్రారంభించారు. ముందుగా వారికి నోటీసులిచ్చి తదుపరి విచారణ జరుపుతారు. ఆ తర్వాత వాటిని తొలిగించాలని ఆదేశాలిస్తారు. అప్పటికి వినకపోతే కేసు నమోదు చేసి జైలుకు పంపే వీలుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *