Home > General > గ్రాండ్ గా 78వ నూమాయిష్

గ్రాండ్ గా 78వ నూమాయిష్

ఎవ్వరికి వారే ఆధార్ వెరిఫికేషన్
కర్కాటకం, మీనం లకు కలిసొచ్చే 2018

numaish-apduniaనుమాయిష్ రానేవచ్చేసింది. ఫిబ్రవరి 15 వరకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా 78వ నుమాయిష్‌ను నిర్వహిస్తున్నారు. 46 రోజుల పాటు నిరాటంకంగా జరిగే ఈ ప్రదర్శన నిర్వహణకు అంతా రెడీ అయింది. మొత్తం 2500 స్టాళ్లను ఏర్పాటు చేయగా, దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు విక్రయాలు సాగించనున్నారు. ఆటపాటలాడుకునే పిల్లల కోసం గేమింగ్ జోన్లు, మహిళలు, పెద్దల కోసం షాపింగ్ సౌకర్యాలతో నగరవాసులను కనువిందుచేస్తోంది. కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీలతో పాటు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన స్టాళ్లు ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయి. పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా, కేరళ, తమిళనాడు, పశ్చిబెంగాల్‌లకు చెందిన సాంస్కృతిక సంస్థలు, అసోసియేషన్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి స్వయం సహాయక సంఘాలు, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, లక్నో, జమ్మూకశ్మీర్ నుంచి మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు.నుమాయిష్‌లో పాల్గొనడంతో పాటు వచ్చే వారి ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారు. యశోదా సహకారంతో నుమాయిష్‌లో ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. 46 రోజుల పాటు వైద్యశిబిరాన్ని నిర్వహించనున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ సూచన మేరకు రాయితీతో కూడిన ఆరోగ్యపరీక్షలతోపాటు, వైద్యసాయాన్ని అందించనున్నారు. ఎత్తు, బరువు, బీఎంఐ, జనరల్ ఫిజిషన్ ఈఎన్‌టీ, దంత, డైటిషియన్, ఫిజియోథెరపిస్ట్‌ల కన్సల్‌టేషన్‌ను ఉచితంగా అందించనున్నారు. ప్రతి ఆదివారం గుండెసంబంధ, ఎముకలు, మధుమేహం, గైనకాలజీ విభాగాల వైద్యులతో ప్రత్యేక క్యాంప్‌ను నిర్వహించబోతున్నారు. ఇక్కడికి వచ్చిన వారికి సాధారణ రోజుల్లో పరీక్షలు నిర్వహించుకునేందుకు వీలుగా, జంటనగరాల్లోని యశోదా గ్రూపు దవాఖానల్లో ఎక్కడైనా పరీక్షలు నిర్వహించుకుంటే 15 శాతం రాయితీ వర్తించేలా కూపన్లను జారీ చేయనున్నారు. గుండె సంబంధ సౌకర్యాలున్న ప్రత్యేక అంబులెన్స్‌ను గ్రౌండ్స్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సాయంత్రం 5 : 30 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఈ వాహనం సేవలందించనుంది. స్టాళ్ల నిర్వాహకులు, సందర్శకుల కోసం వైద్యులు, నర్సులను అందుబాటులో ఉంచనున్నారు.నుమాయిష్‌లో భాగంగా 46 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహిళాదినోత్సవం, బాలల దినోత్సవాలను నిర్వహించి వారికి ఉచిత ప్రవేశాన్ని కల్పించనున్నారు. నుమాయిష్ వేదికగా తెలంగాణ సంస్కృతి రూపాలను ప్రదర్శించబోతున్నారు. వీటితో పాటు ప్రత్యేక పోటీలు సైతం నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com