Home > Vanitha > Recipes > ఓట్స్‌ ఊతప్పం

ఓట్స్‌ ఊతప్పం

బ్రెడ్ బిర్యానీ

oats-ootappam-apduniaకావలసిన పదార్థాలు

ఓట్స్‌ – అరకప్పు, రవ్వ, శనగపిండి – పావు కప్పు చొప్పున, నిమ్మరసం – ఒక టేబుల్‌ స్పూను, బేకింగ్‌ సోడా – పావు టీ స్పూను, ఉప్పు – రుచికి తగినంత, ఉల్లి, టమోటా, క్యాప్సికం తరుగు – అరకప్పు చొప్పున. పచ్చిమిర్చి తరుగు – ఒక టేబుల్‌ స్పూను, కొత్తిమీర తరుగు – అరకప్పు, నూనె – వేగించడానికి సరిపడా.

తయారుచేసే విధానం

ఓట్స్‌ను మిక్సీలో వేసి పిండి చేసుకోవాలి. ఈ పిండిలో రవ్వ, శనగపిండి, ఉప్పు వేసి నీటితో ఉండలు లేకుండా కలిపి 20 నిమిషాలు పక్కనుంచాలి. కూరగాయల తరుగంతా ఒక పాత్రలో కలిపి ఉంచాలి. ఓట్స్‌ మిశ్రమంలో నిమ్మరసం, బేకింగ్‌ సోడాతో పాటు తగినంత నీరు కలిపి జారుగా చేసుకోవాలి. తర్వాత పెనంపై నూనె రాసి ఊతప్పం వేసుకుని పైన సరిపడా కూరగాయ తరుగు చల్లి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. కొబ్బరి చట్నీ మంచి కాంబినేషన్‌.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com