Home > Crime > పాతనేరస్థుడు అరెస్టు

పాతనేరస్థుడు అరెస్టు

టోపీకింద.. నోట్లో..దుస్తుల్లో అన్నీ బంగారు బిస్కెట్లే
ప్రియుడికి గతంలోనే పెళ్లయిందని తెలిసి..

puttur__apduniaచిత్తూరు జిల్లా పుత్తూరులో తమిళనాడు, ఆంద్రప్రదేశ్లో పలు నేరాలలో ముద్దాయిగా ఉన్న పాత నేరస్తుడును పుత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. డియస్పీ కథనం మేరకు సుమన్ అనే వ్యక్తి ఈ నెల 10 వ తదిన పుత్తూరులోని ఆర్డియం ధియోటర్ వద్ద ఉన్న మెడికల్ షాపులో మందులు తీసుకుంటున్న ఒక మహిళా మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. దీంతో నిఘా పెంచిన పోలీసులకు సోమవారం ఉదయం 7 గంటలకు పుత్తూరు మండలం వేపగుంట క్రాస్ వద్ద సుమన్ను పట్టకున్నారు. అయితే ఇతని విచారించగా ఇతను పాత నేరస్ధుడుగా గుర్తించి, ఇతని వద్ద నుండి 41 గ్రాముల బంగారం, 10 ద్విచక్రవాహనాలను రికవరీ చేశారు. ఇతను తమిళనాడులోని చెన్నైలోని మాదవరంకు చెందిన సుమన్, నగరి తడుకుపేటకు చెందిన మహిళను వివాహం చేసుకుని ఇక్కడే ఉంటున్నాడు. ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగ కేసు చేదించిన పుత్తూరు సిఐ సాయినాథ్, ఎస్ఐ హనుమంతప్ప, క్రైం బ్రాంచి పోలీసులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *