Home > Editorial > వన్ నేషన్ .. వన్ ఎలక్షన్స్

వన్ నేషన్ .. వన్ ఎలక్షన్స్

తాడా…పేడా..
బెగ్గింగ్ మాఫియా

one-nation-one-election-apduniaమళ్లీ జమిలి మాట వినిపించింది. వన్ నేషన్ .. వన్ ఎలక్షన్స్ అంటున్నారు… ప్రధాని మోడీ . ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతున్న తరుణంలో ప్రధాని మోడీ నోట జమిలి మాట వినిపించింది. అంతే కాదు.. ఎన్టీయే శ్రేణులు అందుకు సన్నద్ధం కావాలని పిలుపునివ్వడం చూస్తుంటే… వచ్చే ఎన్నికలు జమిలినా అనే అనుమానాలు వ్యక్తం అవుతోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై కేంద్రం దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇదే అంశాలపై సోమవారం ఎన్టీయే పక్ష సమావేశంలో నేతల అభిప్రాయాలను కోరింది. పార్లమెంట్ లోపల.. బయట ఎంపీలంతా ఈ ఎన్నికలపై చర్చించుకుంటున్నారు. పార్లమెంట్‌కు, అసెంబ్లీకీ ఒకేసారి ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను దృష్టి పెట్టుకుని తన ప్రసంగంలో ప్రధానంగా చర్చించారు. గతంలో కూడా ప్రధాని మోదీ ఇదే అంశాన్ని ఎన్డీయే, నీతిఅయోగ్ సమావేశాల్లో ఆయా రాష్ట్రాల సీఎంలతో చర్చించారు. 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉంది. అయితే ఇప్పుడే ఆ ఎన్నికల వేడి రాజుకున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమాశాల్లో భాగంగా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆసక్తికర కామెంట్లు చేశారు. దేశంలో ఎన్నికలన్నీ ఒకే సారి జరిగితే… దేశాభివృద్ధికి ఆటంకం కలగదని – అంతేకాకుండా ఆ విధానం ద్వారా ప్రభుత్వానికి బోలెడు ఖర్చు ఆదా అవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో పాటుగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ దిశగా కలిసి అడుగు వేసేందుకు యత్నిస్తే బాగుంటుందని కూడా ఆయన అభిలషించారు. రాష్ట్రపతి నోటి మాటే … కేంద్రం అభిప్రాయంగా కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది మోదీ అబిప్రాయం. ఈ ప్రతిపాదనకు దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా సానుకూలంగానే స్పందించారని కథనాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉందనగా… సాక్షాత్తు రాష్ట్రపతి నోట పార్లమెంటు సాక్షిగా జమిలి ఎన్నికల మాట వినిపించిందంటే… మోదీ కూడా ఆ దిశగానే పయనిస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు అనువైన వాతావరణం ఏర్పాటుకు సిద్ధం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్‌డీఏ పక్షాలను కోరారు. భాగస్వామ్య పక్షాల నేతలతో సమావేశమైన సందర్భంగా ప్రధాని ఈ మేరకు నేతలను కోరారని ఎన్‌డీఏ వర్గాలు పేర్కొన్నాయి. తరచూ ఎన్నికలు ఎదురవుతుండటంతో అభివృద్ధికి ఆటంకమే కాకుండా భారీ వ్యయం వెచ్చించాల్సి వస్తోందని ఏకకాల ఎన్నికలే దీనికి పరిష్కారమని ప్రధాని భావిస్తున్నారు. మోడీ ముందస్తు ఎన్నికలకు మోడీ సిద్దమౌతున్నారనేందుకు ఈ వ్యాఖ్యలు సంకేతాలను బట్టి అర్ధమౌతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో జమిలి సాధ్యమేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. జమిలి ఎన్నికలు జరగాలంటే అన్ని రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీలను రద్దు చేయాల్సి ఉంది. ఇలా జరగాలంటే సార్వత్రిక ఎన్నికలకు కాస్తంత ముందుగానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే… ఏ ఒక్క రాష్ట్రానికి అభ్యంతరం ఉండదన్న భావన వినిపిస్తోంది. ఈ వాదన నిజమేనన్న కోణంలో పయనిస్తున్న మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఇప్పటికే తమ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా జమిలి ఎన్నికల పేరు చెప్పి… మోదీ ముందస్తు ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారని ఈ విషయాన్ని తన నోటి నుంచి కాకుండా రాజ్యాంగ పెద్దలతోనే చెప్పించేస్తున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రపతి హోదాలో రామ్ నాథ్ కోవింద్ తన ప్రసంగంలో జమిలి ఎన్నికలను ప్రస్తావించారని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *