Home > Vanitha > Beauty > కేశసౌందర్యానికి ఉల్లి చేసే మేళ్ళేంటో చూద్దామా!

కేశసౌందర్యానికి ఉల్లి చేసే మేళ్ళేంటో చూద్దామా!

అన్నం గంజిలో దాగున్న బ్యూటి సీక్రెట్స్..!!
చర్మ సౌందర్యానికి ఉప్పు....

onion-hair-growth-apduniaకేశ సంరక్షణ అంటే చాలా ఆశక్తి ఉన్నా, దానిని సరిగ్గా పర్యవేక్షించుకోకపోవటంతో కేశాలు ఊడిపోవటం, రాలటం జరుగుతుంటుంది. కేశ సంరక్షణ జాగ్రత్తలు తీసుకొన్న తర్వాత కూడా అదే విధంగా ఉంటే దానికి కారణం అనారోగ్యకరమైన జీవన శైలి, ఆహారంలో అసమతుల్యత వల్ల చర్మం మరియు జుట్టు మీద చెడు ప్రభావాన్ని చూపుతుంది.మన వంటగదిలోని చాలా రకాలు వంటకు ఉపయోగించే వస్తువులను హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు తేనె, గుడ్డు, పెరుగు, బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మరసం, మరియు ఉల్లిపాయ వంటివి హోమ్ రెమెడీ హెయిర్ ట్రీట్మెంట్ కు ఉపయోగిస్తుంటారు. అలాగే ఉల్లిపాయ మన కళ్ళలో నీళ్ళు కారేవింధంగా చేస్తుంది. అలాగే కురుల సమస్యలను కూడా నివారిస్తుంది. ‘ఉల్లి ‘చేసినంత మేలు ‘తల్లి ‘కూడా చేయదంటారు. నిజమే ఈ సామెత నూటికి నూరుపాళ్ళు నిజం. ఉల్లి లేని వంట లేదంటే ఆశ్చర్యమేమీ లేదు. ఉల్లి అరోగ్యానికే అనుకుంటున్నారా? సౌందర్యోపాసనకు కూడా ఉపయోగ పడుతుంది.

ఉల్లి వలన కేశాలకు కలిగే లాభాలు ఏమిటో చూద్దామా…!

  • ఉల్లిపాయలో అధిక శాతంలో సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ రక్త ప్రసరణను పెంచి, కురులకు శక్తిని ఇస్తుంది. ఉల్లిపాయను మెత్తగా చేసి తలకు రాయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది. దీన్ని అలాగే ఉల్లిపాయ పేస్ట్ తలకు పట్టించడం లేదా ఏదైనా ఇతర హెయిర్ ప్యాక్ లతో ఈ పేస్ట్ ను కూడా కలిపి తలకు పట్టించాలి. ఇలా చేయడానికి అరగంట ముందు తలకు హాట్ ఆయిల్ మసాజ్ చేయాలి.
  • ఉల్లిపాయ రసం తలలో ఇతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ మీ కేశాలను డ్యామేజ్ చేయవచ్చు. అంతే కాదు అది జుట్టు రాలడానికి ముఖ్య కారణం కావచ్చు. కాబట్టి స్లాప్ ఇన్ఫెక్షన్ అరికట్టడానికి ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించండి. ఇంకా హెయిర్ ఫాలీసెల్స్ లో మూసుకు పోయిన రంద్రాలను తెరచుకొనేలా చేస్తుంది.
  • ఉల్లిపాయ రసంను తలకు పట్టించడం వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరిగి కొత్తగా వెంట్రుకలు మొలవడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ హెయిర్ ఫాల్ ను అరికట్టడమే కాదు, హెయిర్ గ్రోత్ కు కూడా సహాయపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని కొబ్బరి నూనెలో కలుపుకొని బాగా మిక్స్ చేసి తల మాడుకు మసాజ్ చేయాలి. చేసిన అరగంట తర్వాత రెగ్యులర్ గా ఉపయోగించే మంచి షాంపుతో, చల్లనీటి తలస్నానం చేసుకోవాలి.
  • హోం రెమడీస్ లలో చుండ్రును వదలగొట్టడానికి ఇదొ అద్బుతమైన చిట్కా. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించడం వల్ల హెయిర్ లాస్ అరికడుతుంది. అలాగే చుండ్రును నివారిస్తుంది. మీరు రెగ్యులర్ గా తలకు వాడే హెయిర్ ప్యాక్ కి కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని కూడా చేర్చడం వల్ల చుండ్రును నివారించగలుగుతుంది. నిమ్మరసం, పెరుగు, మరియు కొద్దిగా తేనె మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల కూడా చుండ్రును నివారంచవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *