Home > Editorial > ఆన్ లైన్ లో పశు సంపద వివరాలు

ఆన్ లైన్ లో పశు సంపద వివరాలు

ఇసుకాసురులు!
చిత్తూరు జిల్లాల్లో మూత పడనున్న 53 స్కూళ్లు
 
animala_apduniaపశు సంపద పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. పశువుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ వాటి నుంచి సంపదను పెంపొందించడం, పాలు, పాల ఉత్పత్తుల కొరత లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది. పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం అయ్యేలా, పథకాల అమలులో అక్రమాలకు తావులేకుండా పశువులకు బార్ కోడింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ ప్రక్రియను ఇన్‌ఫర్మేషన్ నెట్‌వర్క్ ఫర్ ఎనిమల్ ప్రొడక్టవిటీ అండ్ హెల్త్ (ఇనాఫ్) చేపట్టనుంది. ఇనాఫ్ వెబ్‌సైట్‌లో పశువుకు సంబంధించిన ట్యాగ్ నంబరు నమోదు చేస్తే పశువు, యజమాని వివారాలు తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయడానికి జిల్లా రిసోర్స్ పర్సన్‌లు శిక్షణ సైతం ఇచ్చారు. కిందస్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఇనాఫ్ కింద వివరాలను నమోదు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇనాఫ్ కింద నమోదైన పశువులను విక్రయిస్తే కొనుగోలుదారుడి పేరిట బదలాయించే అవకాశం ఉంటుంది. అనంతరం మిగితా వివరాలు నమోదు చేయడం ద్వారా కొనుగోలు చేసిన వ్యక్తికి పశువుకు సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా పశువు ఎవరి వద్ద ఉందో తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ పథకాల పొందే పశువులకు అక్రమంగా విక్రయించే విధానానికి తెరపడనుంది. ఒకసారి ఇనాఫ్ కింద నమోదైన పశువు చనిపోయే వరకు దాని వివరాలు ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.గ్రామాల్లో స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం పశువులను పంపిణీ చేస్తుంది. కానీ కొందరు లబ్ధిదారులు ప్రభుత్వం అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. పశువులకు ఇనాఫ్ ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. ఇనాఫ్ నమోదు ప్రక్రియ జిల్లాలోని పశువుల గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో భాగంగా పశువుల చెవులకు బార్ కోడింగ్ ఉన్న 12 అంకెల ట్యాగ్‌ను అమరుస్తారు. అందులో పశువుతో పాటు యజమాని వివరాలు, సెల్‌ఫోన్ నంబరు నమోదు చేస్తారు. పశువు పుట్టిన తేదీ తదితర 18 అంశాలను యజమానికి సంబంధించిన 21 అంశాలను నమోదు చేయగానే బార్‌కోడ్ రావడంతో పాటు గుజరాత్‌లోని ఆనంద్‌లోని సెంట్రల్ సర్వర్‌లో వివరాలను పొందుపరుస్తారు. పశువులకు రోగ నిరోధక టీకాలు ఇవ్వాల్సిన సమయం, గర్భస్థ స్థితి, పాలు ఇస్తున్న వివారులు, పోషకాహారం అందించాల్సిన సమాచారం రైతు సెల్‌ఫోన్‌కు వస్తుంది. వీటి ఆధారంగా పాడి రైతులు పశువులకు అందించాల్సిన ఆహారం, ఆరోగ్య పరిస్థితి, మేత, గర్భస్థ స్థితి, ఇతర వైద్య సేవల కోసం వైద్యులను సంప్రదిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *