Home > Movies > ఇక సినిమా షూటింగ్ లకు ఆన్ లైన్ అనుమతులు

ఇక సినిమా షూటింగ్ లకు ఆన్ లైన్ అనుమతులు

సెప్టెంబర్‌ 15న మహేష్ బాబు 'స్పైడర్‌' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌
కార్తీ, రకుల్‌ జంటగా ఖాకి

Talasani-Srinivas-Yadav-apduniaచలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల పై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దసరా నాటికి సింగల్ విండో విధానంలో ఆన్ లైన్ లో సినిమా షూటింగ్ లకు అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అయన తెలిపారు. దసరా నుండి 5 వ ఆటగా చిన్న చిత్రాల ప్రదర్శన కు అనుమతులు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని అయన వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ స్టూడియో నిర్మించేందుకు అబ్దుల్లాపూర్ మెట్, కోహెడ ప్రాంతాలలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ లలో మినీ థియేటర్ ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. నవంబర్ లో నిర్వహించనున్న బాలల చలనచిత్ర ఉత్సవాలకు 8 కోట్ల రూపాయల ను విడుదల చేయాలని ప్రతిపాదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *