Home > Vanitha > Recipes > పల్లీల పూర్ణాలు

పల్లీల పూర్ణాలు

బాదాం పకోడీ
కీర మిల్క్‌షేక్‌

palli_apduniaకావలసినవి :

నువ్వులు: కప్పు, పల్లీలు: అరకప్పు, నువ్వులు: కప్పు, కొబ్బరిముక్కలు: అరకప్పు, బెల్లం తురుము: ఒకటిన్నర కప్పులు, నూనె: వేయించడానికి సరిపడా, బియ్యం: 2 కప్పులు, మినప్పప్పు: కప్పు, ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం :

 మినప్పప్పు, బియ్యం విడివిడిగా ఆరు గంటలసేపు నానబెట్టాలి. బాగా నానాక తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి.  బాణలిలో నువ్వులు పది నిమిషాలు వేయించాలి.  పల్లీలు కూడా వేయించాలి. చల్లారాక రెండూ కలిపి రుబ్బాలి. అందులోనే బెల్లం తురుము కూడా వేసి బాగా కలపాలి. సన్నగా కోసిన కొబ్బరి ముక్కలు కూడా వేసి కలపాలి.  మిశ్రమాన్ని ఉండలుగా చేసి ఉంచాలి. ఇప్పుడు ఒక్కో ఉండనీ పిండిమిశ్రమంలో ముంచి కాగిన నూనెలో పూర్ణాల మాదిరిగా వేసి ఎర్రగా వేయించి తీయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *