Home > Vanitha > Recipes > పనీర్ లాలీ పాప్

పనీర్ లాలీ పాప్

చర్మ సౌందర్యానికి ఉప్పు....
చర్మ సౌందర్యానికి స్ట్రా బెర్రీ

paneer-lollipop-apduniaకావలసిన పదార్దాలు :
బంగాళదుంపలు – 2
బేబీ కార్న్ – 6
పనీర్ – 1/4 కప్పు
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 4
కొత్తిమిర – 3 tsp
అల్లం వెల్లుల్లి ముద్ద – 1 tsp
సోయా సాస్ – 1/4 tsp
అజినొమొటొ – చిటికెడు
కార్న్‌ఫ్లోర్ – 3 tsp
మైదా – 1/2 కప్పు
మిరియాల పొడి – 1/2 tsp
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి

తయారు చేయు విధానం :
బంగాళదుంపలను మెత్తగా ఉడికించి పై తొక్క తీసి ఒక బౌల్ లో వేసి మెత్తగా చిదమాలి. దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, మిరియాలపొడి, అజినొమొటొ, కార్న్‌ఫ్లోర్ వేసి మొత్తం బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచం పెద్ద సైజు నిమ్మకాయ అంత ఉండలుగా చేసుకోవాలి. బేబీ కార్న్ లావుగా ఉన్న వైపు ఈ మిశ్రమాన్ని పెట్టి గుండ్రంగా చుట్టాలి. దాన్ని బాగా వత్తి కొద్దిగా వెడల్పుగా చేసి మైదా పిండిలో దొర్లించాలి. మొత్తం ఇవన్నీ మైదాలో రోల్ చేసాక పక్కన పెట్టుకొవాలి. వీటిని వేడి నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకు వేగించుకోవాలి. వీటిని ప్లేట్ లో తీసుకోని టమాటా సాస్‌తో వేడిగా సర్వ్ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *