Home > Vanitha > Recipes > పన్నీర్ పాస్తా

పన్నీర్ పాస్తా

చికెన్ లాలీ పాప్స్
బాదాం పకోడీ
panner pastha_apduniaకావలసిన పదార్థాలు :
పాస్తా – 350గ్రా. పాస్తాసాస్ – 24మి.లీ. వెల్లుల్లిపాయలు – 2 రెబ్బలు పచ్చిమిర్చి – 1 పన్నీర్ – 250గ్రా. పాలకూర – ఒక కట్ట
క్యారెట్, బీన్స్, కార్న్, బఠాణీ – 2 కప్పులు ఆలివ్ ఆయిల్ – 2 స్పూన్స్ చీజ్ – కొద్దిగా మిరపగింజలు – ఒక టీ స్పూన్ 
ఉప్పు – తగినంత

తయారుచేసే విధానం :
ఒక గిన్నెలో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. ఇందులో పాస్తా వేసి ఉడికించాలి. ఈలోపు పాన్‌లో ఆలివ్ ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి పాస్తా సాస్ పోయాలి. దీంట్లో క్యారెట్, బీన్స్, కార్న్, బఠాణీలు, పాలకూర వేసి కలపాలి. సన్నని మంట మీద కాసేపు ఉండనివ్వాలి. ఇందులో పన్నీర్, మిరపగింజలు వేసి మూత పెట్టేయాలి. సన్నని మంట మీద 5నిమిషాలు అలాగే ఉంచాలి. పాస్తాలోని నీళ్లు వడబోసి ఇందులో కలుపుకోవాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చీజ్‌తో గార్నిష్ చేయాలి. పన్నీర్ పాస్తా రెడీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *