Home > Bhakti > అయోధ్యలో శతకోటి రామనామ జప మహా యజ్ఞం

అయోధ్యలో శతకోటి రామనామ జప మహా యజ్ఞం

ఈసారి 20 లక్షల టీటీడీ క్యాలెండర్లు : ఈవో
ఘనంగా సిరిమాను సంబరాలు

paripoornananda-swami-apduniaఅయోధ్యలో రామమందిరం నిర్మించాలన్నది 100 కోట్ల మంది భారతీయుల కలని, దాన్ని నెరవేర్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని పరిపూర్ణానంద స్వామి వెల్లడించారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈనెల ఐదు నుంచి పదిహేను వరకు అయోధ్య లో శతకోటి రామనామ జప మహా యజ్ఞం జరుగుతుందని అన్నారు. అయోధ్య రామ మందిరం గుడి కాదు. ఒక చరిత్ర అని అన్నారు. హిందువుల చరిత్ర, భారతీయ సంస్కృతి, కోట్లాది భారతీయల విశ్వాసమని అభివర్ణించారు. ప్రభుత్వాలు జాతిలో ఆత్మ గౌరవాన్ని నింపాలి. రేపటి నుంచి యజ్ఞం ప్రారంభిస్తాం. ఈ ప్రభుత్వాలు హిందూ ధర్మం పై వివక్ష చూపిస్తున్నాయని అయన ఆరోపించారు. కులాల పై పుస్తకం రాసిన వారిని ఏమి అనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. [

తెలుగు రాష్ట్రాల ప్రజలు వాళ్ళ ఇళ్లలో హనుమంతుడి దీపారాధన చేయాలి. వచ్చే సంవత్సరం వరకు రామ మందిరం నిర్మాణం పనులు ప్రారంభం కావాలి అని ప్రతి హిందువు కోరుకుంటున్నారు. కోర్టులు బయట పరిష్కరించకోమన్నాయి. . చట్ట ప్రకారం మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు. హిందుత్వం అనేది బీజేపీ కి అప్పజెప్పలేదు. ఎవరు రామ మందిరానికి మద్దతు ఇస్తారో ..80 శాతం హిందువులు వారికి మద్దతు ఇస్తారని స్వామిజీ స్పష్టం చేసారు. అయోధ్య వివాదం మేము సృష్టించలేదని అన్నారు. స్పష్ట మైన తీర్పు వస్తే రామమందిర నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. ఈ యజ్ఞ నికి బీజేపీ కి సంబంధం లేదు. రామమందిర నిర్మాణం బీజేపీ చేతిలో లేదు. న్యాయస్థానం పరిధిలో ఉందని అయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com