Home > Health > నీలో ఫర్ లో పెరుగుతున్న రోగులు

నీలో ఫర్ లో పెరుగుతున్న రోగులు

మూడొందల వ్యాధులకు మునగే మందు
శీతాకాలంలో టమోటా ఉపయోగాలు

niloufer_apduniaహైదరాబాద్‌ నగరంలో జ్వరా లతో చిన్నారులు విలవిల్లాడుతున్నారు. చలి తీవ్రత కారణంగా శ్వాసకోస వ్యాధు లు ప్రబలుతున్నాయి. సీజనల్‌ వ్యాధులతో నగరంలోని లక్డికాపూల్‌ సమీపంలో గల నీలోఫర్‌ ఆస్పత్రిలో రోగుల సంఖ్య రోజు రోజు కూ పెరుగుతోంది. ప్రతిరోజు చికిత్స కోసం దాదా పు 1500 మందికిపైగా అవుట్‌ పేషెంట్లు (ఓ.పీ) వస్తున్నారు. ఇందులో 800 మందికి పైగా చిన్నా రులు ఉండడం విశేషం. జ్వరాలు, దగ్గు, జలుబు, అలర్జీ, నిమోనియా తదితర వ్యాధులతో చిన్నారు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నీలోఫర్‌ చిన్నారులతో నిండిపోతుంది. చిన్నారులను ఎత్తుకొని తల్లులు ఓపీ వార్డు వద్ద నిరీక్షిస్తున్నారు. అవుట్‌పేషెంటు వార్డులో పేషెంట్లతో బారులు తీరుతున్నారు. ఈ విధంగా రోజుకు 300మందికి పైగా ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. కానీ సకాలంలో వైద్యం అందక ఇబ్బందులపాలవుతున్నారు. వైద్యుల కోసం గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న చిన్నారులకు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.నీలోఫర్‌ ఆస్పత్రిలోనే కాకుండా నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రుల్లోనూ రోగుల సంఖ్య పెరిగింది. చలి పెరగడంతో అనేకమంది శ్వాసకోషవ్యాధులతో సతమతమవుతున్నారు. నీలోఫర్‌తోపాటు ఫీవర్‌ ఆస్పత్రిలోనూ చిన్నారులు రోజుకు 100మందికి పైగా చికిత్స చేయించుకుంటున్నారు. ఈ ఆస్పత్రిలో రోజుకు 20మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. చిన్నారులే కాకుండా వృద్దులు, మహిళలు జలుబు, జ్వరాలు, దగ్గు, తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. గాంధి ఆస్పత్రిలో రోగుల రద్దీ ఎక్కువగానే ఉంది. ఉస్మానియాలో వార్డులకు తగిన సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *