Home > Tirumala News > పవిత్రోత్సవాలకు అంకురార్పణం

పవిత్రోత్సవాలకు అంకురార్పణం

నెలరోజులపాటు పుష్కరిణీ మూసివేత
నిఘా కెమెరాలతో చిక్కుతున్నారు...

tirumala-day-3-pavithrothsavam_apduniaతిరుమల శ్రీవారి ఆలయంలో తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహరణార్థం ప్రతిఏటా ఆగస్టు నెలలో పవిత్రోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. ఆగమ శాస్రోక్తంగా అంకురార్పణ బుధవారం నాడు జరిగింది. రేపటి నుండి మూడు రోజుల పాటు తిరుమలలో ఈ పవిత్రోత్సవాలు జరుగుతాయి. క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు అత్యంత పవిత్రంగా తిరుమలలో నిర్వహించేవారు. క్రీ.శ.1562 తర్వాత నిలిచిపోయిన ఉత్సవాలను తిరిగి 1962 నుంచి టీటీడీ ఏటా శ్రావణ మాసంలో మూడు రోజుల పాటు వైదిక ఆచారాలతో నిర్వహిస్తోంది. పవిత్రోత్సవాల సందర్బంగా అన్ని ఆర్జిత సేవలతో పాటు విఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసింది టీ.టీ.డీ. పవిత్రోత్సవాల్లో భాగంగా ఇవాల రాత్రి 7 గంటలకు శ్రీవారి సేనాపతి విష్వక్సేనుడు తిరువీదుల్లో ఊరేగుతారు. పవిత్రోత్సవాల సందర్బంగా ప్రత్యేక దర్శనాలైన అష్టదళ పాదపద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు టీ.టీ.డీ రద్దు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *