Home > Politics > పరకాల ప్రభాకర్ పై విరుచుకపడ్డ పవన్

పరకాల ప్రభాకర్ పై విరుచుకపడ్డ పవన్

ప్రాజెక్టుల సత్వర పూర్తే సర్కార్ లక్ష్యం : కేసీఆర్
నాన్న పేరును నిలబెట్టాలన్న తపన..మాటకోసం పాదయాత్ర:జగన్

prakala-pawan-kalyan-apduniaఏపి ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరకాల ప్రభాకర్ వంటి కమిట్ మెంట్ లేని వ్యక్తులెవరూ జనసేనలో ఉండరని పవన్ అన్నారు. ప్రత్యేక హోదాపై మాట్లడడానికి తాను చాలా చిన్నవాడినని పేర్కొన్నారు. తాను రాజకీయంగా అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేనని చెప్పిన పవన్ తనకు వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లరనీ, ఉన్నా తాను తీసుకోనని చెప్పారు. తన అన్న చిరంజీవి నోరు లేని వ్యక్తి కాబట్టే పరకాల వంటి వారు నోటికొచ్చినట్లు మాట్లాడగలిగారని ఆయన అన్నారు.

ప్రజారాజ్యం పార్టీలో తనను నటుడిగానే చూశారని పవన్ అన్నారు. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా తనను అసలు గుర్తించలేదని ఆయన అన్నారు. అందుకు తాను చాలా బాధపడేవాడినని గుర్తు చేసుకున్నారు. ప్రజారాజ్యం వైఫల్యానికి కొందరు వ్యక్తుల ద్రోహమే కారణమని చెప్పారు. ప్రజారాజ్యంలో నేర్చుకున్న పాఠాలతోనే జనసేనను స్థాపించానని పవన్ కల్యాణ్ చెప్పారు. దేహానికి రక్తం ఎలాగో… జనసేనకు కార్యకర్తలు అలాగని అన్నారు. శుచి, శుభ్రత లేకుండా దేవాలయాలకు వెళ్లకూడదో.. ఆలోచన, శుచి లేకుండా రాజకీయాల్లోకి రాకూడదన్నారు. తన వృత్తి సినిమాలు అయితే.. ప్రవృత్తి రాజకీయం అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా పని చేయొచ్చు.. ఎన్నో అద్భుతాలు సృష్టించొచ్చన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com