Home > General > డెంగ్యూ జ్వరాలతో కలవరం

డెంగ్యూ జ్వరాలతో కలవరం

వచ్చే ఏఢాది నాటికి ఇంటర్నేషనల్ స్టేడియం రెడీ
సర్కారీ ఆఫీసులకు కరెంట్ ప్రీ పెయిడ్‌ మీటర్లు

dengue-fever-apduniaడెంగ్యు జ్వరా లు కోరలు చాచి టైగర్ దోమలు జిల్లా వాసులను కలవరపాటుకు గురిచేస్తున్నా అధికార యంత్రాంగం హడావిడి తప్ప చర్యలు శూన్యం. టైగర్ దోమలు నిల్వవున్న మంచినీటి స్థావరాల్లో సంచరిస్తూ పట్టపగలే ఇళ్లల్లో వాలి జనాలను కా టువేస్తున్నాయి. జిల్లాలో రాయచోటి, కడప, చెన్నూరు, బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, చిన్నమండెం తదితర ప్రాంతాలతోపాటు 8 పురపాలక సంఘాల్లో టైగర్ దోమలు విజృంభిస్తున్నాయి. పగటిపూట నీటి నిల్వవున్నచోట, డ్రమ్ములలో, రక్షిత నీటి ట్యాంకులపై , బ్రిడ్జిలపై, కొబ్బరికాయలు, సీసాల మూతపై చెత్తాచెదారం ఉన్న ప్రాంతాల్లో, పాత టైర్లు తదితర ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ తిష్టవేసుకుంటున్నాయి. ఈమధ్యకాలం లో కురిసిన వర్షాలకు టైగర్ దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. మ్యుంగా ఆర్‌డబ్ల్యుఎస్, గ్రామపంచాయతీ అధికారులు, పురపాలక, నగరపాలకం, పంచాయతీరాజ్ అధికారుల్లో పూర్తి గా సమన్వయలోపంతో పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలారు. దీంతోపాటు వైద్య ఆరోగ్యసిబ్బంది, అధికారులు, ప్రత్యేకించి మలేరియా అధికారులు ప్రకటనలకే పరిమితవౌతున్నారు కానీ ప్రజల్లో డెంగ్యుపై విస్తృత ప్రచారం లేకపోవడం, నివారణ చర్యలు తీసుకోకపోవడం వెరసి రాయలసీమ జిల్లాల్లో కడప జిల్లాను డెంగ్యు జ్వరాలు పట్టి పీడిస్తూ పిప్పిచేస్తూ ప్రజల ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోతున్నాయి. జ్వరం సోకిన తర్వాత ప్రభుత్వాసుపత్రులకు వెళ్లినా, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లినా తూ.తూ మంత్రంగా రక్తపరీక్షలు చేసి మలేరియా, టైఫాయిడ్ , వైరల్ ఫివర్ అని తాత్కాలికంగా వైద్యంచేసి చేతులుదులుపుకుని వేలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. జ్వరంలో వదిలిన అనంతరం ఎలిసా టెస్టులు చేసుకోవాలని, ప్లేట్ లైట్స్ తగ్గాయని రెఫర్ అంటూ చేతులు దులుపుకుంటున్నారు. అయితే పేద ప్రజానీకానికి బయటకు వెళ్లేందుకు ఆర్థికస్తోమత లేనికారణంగా ప్రాణాలపై ఆశలు వదులుకుంటున్నారు. జిల్లాలో సంబంధిత ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలు, ఏరియా వైద్యశాలలు, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి, రిమ్స్‌లలో అధికారిక లెక్కల ప్రకారం 2017 జనవరి నుంచి ఇప్పటి వరకు 20మంది పైబడి డెంగ్యుతో మృతి చెందినట్లు నిర్ధారిస్తున్నారు. బాధితుల కథనం మేరకు 30మంది పైబడే మృత్యువాతకు గురయ్యారని చెప్పుకొస్తున్నారు. డెంగ్యుకోరలు చాచిన ప్రాంతాల నుంచి హైదరాబాద్, కర్నూలు, తిరుపతి, తమిళనాడులోని వేలూరు సిఎంసి, కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు సెయింట్‌జోసఫ్ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లోకి వెళ్లి మరో 10మంది మృత్యువాతకు గురై ఉండవచ్చునని తెలుస్తోంది. జిల్లాలో గత ఐదేళ్ల కేసుల వివరాలు తీసుకుంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 2014లో 16మందికి, 2015లో 221 మందికి, 2016లో 13మందికి మాత్రమే డెంగ్యుసోకిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇన్‌పేషెంట్లుగా వివిధ జబ్బులతో నెలసరికి 12వేల మంది ఏరియా ,నగర పాలక ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇక మలేరియా కేసులు నిమిత్తం ఇప్పటివరకు లక్షా 76వేల పైచిలుకు రక్తపరీక్షలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్లు వివిధ వైద్యాధికారులు కాకిలెక్కలు చెబుతున్నారు. ఇంచుమించు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అదే సంఖ్యలో రక్తపరీక్షలు నిర్వహించి ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలో పారిశుద్ధ్యలోపం, తాగునీటి కలుషితం, జిల్లావ్యాప్తంగా రోడ్లపైనే చెత్తాచెదారం మురుగునీరు ఎక్కడపడితే అక్కడ నిల్వవుండటం, పందికొక్కులు, దోమలు, ఈగలు, పందులు సంసారం చేస్తుండటంతో అక్కడి నుంచి దోమలు సరాసరి ఇళ్లల్లోకి పట్టపగలే ప్రవేశించి జనాలను కుట్టడం, డెంగ్యు జ్వరంతో గజగజవణకడం, ప్రాథమిక వైద్యులు, చికిత్స, వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో కొండనాలుకకు మందు వేస్తే ఉన్ననాలుక ఊడిన చందంగా మలేరియా , టైఫాయిడ్, వైరల్, విషజ్వరాలకు చికిత్సలు చేసి డెంగ్యుజ్వరాన్ని తీవ్రతరం చేస్తు జిల్లాలో డెంగ్యు మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగి జిల్లా వాసులను గజగజ వణికిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *