Home > Crime > ఉరి శిక్ష రద్దుపై పిల్

ఉరి శిక్ష రద్దుపై పిల్

250 వెబ్ సైట్లకు నోటీసులు
కర్నూలు విషాదం…ఎస్సై భార్య ఆత్మహత్య

hanging-apduniaతీవ్రవాదులు, క్రూరమైన నేరాలకు పాల్పడేవారికి దేశంలో విధించే అతిపెద్ద శిక్ష మరణశిక్ష. మనదేశంలో ఈ శిక్షను ఉరితీయడం లేదా 1950 ఆర్మీ చట్టం ప్రకారం కాల్చిచంపడం ద్వారా అమలుచేస్తారు. అయితే ఉరితీయడాన్ని అమలును సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేప్పటింది. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం మూడు వారాల్లోగా సమాధానం తెలియజేయాలని సూచించింది.మరణశిక్షల విధానాన్ని మార్చాలని కోరుతూ న్యాయవాది రిషి మల్హోత్రా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంటుందని.. అది జైల్లో ఉన్న ఖైదీకీ వర్తిస్తుందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఖైదీ మరణం గౌరవప్రదంగా, బాధలేకుండా ఉండేలా చూడాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖాన్విలక్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.మరణం మరింత ప్రశాంతంగా ఉండేలా శిక్షలు ఆలోచించాలని ధర్మాసనం కేంద్రానికి సూచనలు చేసింది. ‘ఏ వ్యక్తి బాధపడుతూ చనిపోవాలని అనుకోడు. ప్రశాంతగా మరణించాలని కోరుకుంటాడు’ అని ధర్మాసనం పేర్కొంది. ఉరిశిక్షను పూర్తిగా రద్దుచేయాలని మానవహక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *