Home > Editorial > సౌత్ లో మిగులు కరెంట్ వినియోగించుకొనేందుకు ప్లాన్

సౌత్ లో మిగులు కరెంట్ వినియోగించుకొనేందుకు ప్లాన్

విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు
ర్యాంకులు సరే... అనుకూలతలు ఏవీ

power surplus_apduniaఏ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నా, దాన్ని అవసరమైన రాష్ట్రం తక్షణం అందిపుచ్చుకునే విధంగా సరళమైన పరస్పర ఒప్పందం కుదుర్చుకోవాలని దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. మిగులు, లోటు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు రెండింటికీ ప్రయోజనం కలిగే విధంగా ఒప్పందం ఉండాలని నిర్ణయించిన విద్యుత్ సంస్థలు, ఇందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించడానికి ఓ ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించాయి. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విషయాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించాయి. విద్యుత్ అంశానికి సంబంధించి దక్షణాది రాష్ట్రాలకు చెందిన విద్యుత్ సంస్థలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. మిగులు, లోటు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు రెండింటికి ప్రయోజనం చేకూరేలా ఒప్ఫందం చేసుకోవాలని. అందుకు అవసరమైన గైడ్ లైన్స్ కోసం ఓ కమిటీని వేసుకోవాలని నిర్ణయించాయి. దక్షిణాది రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీ కోసం చేసుకోవాల్సిన ఒప్పందం అవసరాన్ని, దీని వల్ల కలిగే ప్రయోజనాలను ఎస్.ఆర్.పి.సి చైర్మన్ ప్రభాకర్ రావు వివరించారు. ఇప్పుడు అమలు అవుతోన్న విధానం ప్రకారం…ప్రస్తుతం మిగులు విద్యుత్ ఉన్న వారు దానిని ఇతర రాష్ట్రాలకు అమ్మాలన్నా… విద్యుత్ లోటు ఉన్న రాష్ట్రాలు ఎవరి వద్ద నుంచైనా కొనాలన్నా… పవర్ ఎక్ఛేంజ్ ద్వారా లావాదేవీలు నడపాలి. ఒకరోజు ముందుగా సమాచారం అందించాలి. మిగులు ఏర్పడిన వెంటనే ఆ విద్యుత్ ను బహిరంగ మార్కెట్లో విక్రయించడం కుదరదు. సమయం పడుతుంది. లోటు విద్యుత్ ఉన్న రాష్ట్రం కూడా వెంటనే విద్యుత్ పొందలేదు. ఒకరోజు ముందుగానే డిమాండ్ అంచనా వేసి విద్యుత్ కొనుగోలు చేయాలి. ఈ విధానం వల్ల ఇబ్బందులు ఏర్పడడమే కాకుండా, విద్యుత్ సంస్థలకు నష్టాలు కూడా వస్తున్నాయి. ముందస్తు అంచనాలు కొన్ని సార్లు వాస్తవరూపం దాల్చడం లేదు. సమయానికి మిగులు విద్యుత్ కొనేవారు లేకపోవడంతో ఉత్పత్తి కేంద్రాలను బ్యాక్ డౌన్ చేసుకోవాల్సి వస్తున్నది. బ్యాక్ డౌన్ చేసినప్పటికీ పిపిఎ ప్రకారం ఫిక్స్ డ్ చార్జీలు చెల్లించాల్సి వస్తున్నది. దీని వల్ల విద్యుత్ సంస్థలకు నష్టం వాటిల్లుతున్నది. ఇక కొత్తగా చేసుకోబోయే ఒప్పందం వల్ల కొన్ని లాభాలుండబోతున్నాయి. ఇబ్బందులు, నష్టాలు నివారించుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలు ఇకపై పరస్పర ఒప్పందానికి వస్తాయి. దీని ప్రకారం.. దక్షిణాదిలోని ఏ రాష్ట్రంలో మిగులు ఉన్నా, లోటు ఉన్నా, దక్షిణాది లోడ్ డిస్పాచింగ్ సెంటర్ (ఎస్.ఆర్.ఎల్.డి.సి.) కు సమాచారం ఇవ్వాలి. ఈ రెండూ ఎస్.ఆర్.ఎల్.డి.సి.కి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్.ఆర్.ఎల్.డి.సి. విద్యుత్ లోటు ఉన్న రాష్ట్రానికి మిగులు ఉన్న రాష్ట్రం నుంచి విద్యుత్ అందిస్తుంది. ఈ ప్రక్రియ అంతా కేవలం గంట సమయంలోనే ఆన్ లైన్ లో జరిగిపోతుంది. దీని వల్ల ఏ క్షణంలో విద్యుత్ డిమాండ్ పెరిగినా, తగ్గినా దానికి అనుగుణంగా అమ్మకాలు, కొనుగోళ్లు జరపవచ్చు. కొనుగోళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేకుండా, ఒకే సారి దక్షిణాది రాష్ట్రాలన్నీ పరస్పర ఒప్పందం చేసుకుంటాయి. దీని ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరికి మిగులు విద్యుత్ అందుబాటులో ఉన్నా, ఆ కరెంటును లోటు ఉన్న దక్షిణాది రాష్ర్టానికి అందిస్తారు. మిగులు, లోటుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరస్పరం అందించుకోవడానికి వెంటనే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తాయి. ఇండియన్ ఎనర్జీ ఎక్చేంజ్ నిర్ణయించే రేట్లు ఈ క్రయ విక్రయాలకు వర్తిస్తాయి. ఇక అన్ని రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండడంతో పాటు, ఇబ్బందులను సత్వరం తొలగించే వెసులుబాటు కలిగిన ఈ ఒప్పందం పట్ల ఎస్.ఆర్.పి.సి. సభ్య రాష్ట్రాలు తమ ఆమోదం తెలిపాయి. ప్రాథమిక ముసాయిదాను అంగీకరించాయి. ఒప్పందం తుది ముసాయిదా తయారు చేయడానికి, విధి విధానాల రూపకల్పనకు సభ్య కార్యదర్శి భట్ నాయకత్వంలో ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీలో సభ్య రాష్ట్రాల ప్రతినిధులుంటారు.. వచ్చే నెల 20న కేరళ రాష్ట్రంలో మరోసారి సమావేశమై తుది ముసాయిదాపై చర్చించి, నిర్ణయం తీసకోవాలని సమావేశం తీర్మానించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *