Home > Editorial > ఆటకెక్కిన ఆటలు

ఆటకెక్కిన ఆటలు

సంస్కరణలో దిశగా బ్యాంకింగ్ రంగం
గిరిపుత్రలపై మహమ్మారి పంజా
 
 rte schools_apduniaపాఠశాలల్లో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. విద్యాబోధనతో సమానంగా క్రీడల పట్ల ఆదరణ చూపించాల్సిన ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాలు విద్యార్థులను తరగతి గదుల్లోని నాలుగు గోడలకే  పరిమితం చేస్తున్నాయి. ప్రాథమిక స్థాయి నుంచే వివిధ రకాల క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించడం వల్ల వారిలో దాగి ఉన్న క్రీడా సామర్థ్యాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పాఠశాలల్లో ఆటలు ఆడేందుకు మైదానాలు లేక విద్యార్థులు క్రీడల పట్ల నిరాదరణకు గురవుతున్నారు. పాఠశాల ప్రాంగణంలో కనీసం రెండు ఎకరాలైనా ఆటస్థలానికి కేటాయించాలన్న విద్యాశాఖ నిబంధన ను ప్రైవేట్‌ పాఠశాలలు తుంగలో తొక్కాయి. చాలా ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు నివాసిత ప్రాంతాల్లోని ప్రైవేట్‌ భవనాలను అద్దెకు తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నాయి. ఒక్కో సెక్షన్‌లో పరిమితికి మించి విద్యార్థులను చేర్చి ఊపిరాడకుండా చేస్తున్నారు. జిల్లాలో 407 ప్రైవేట్‌ పాఠశాలలు ఉండగా దాంట్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 1,00,688 మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ దీంట్లో సగానిపైగా పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేవని విద్యాశాఖ గణాంకాలే చెప్తున్నాయి. పాఠశాలల అనుమతులు జారీ చేసేటప్పుడు క్రీడలకు ప్రత్యే కంగా స్థలం కేటాయించాలనే నిబంధన చేర్చినప్పటికీ విద్యాశాఖ అవేమీ పట్టించుకోకుండానే అనుమతులు జా రీ చేస్తోంది. డొనేషన్లు, అడ్మిషన్లు, ఫీజు లు..ఇలా వివిధ రకాల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.వేలు దండుకుంటున్న యాజమాన్యాలు చదువులు, ర్యాంకుల కోసం విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నాయి తప్పా క్రీడల పట్ల ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో సర్కారు పాఠశాలు 1,481 ఉండగా వాటిల్లో 842 పాఠశాలల్లో మాత్రమే క్రీడా మైదానాలు ఉన్నాయి. 639 పాఠశాలల్లో మైదానాలు లేవని విద్యాశాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి 1,06,460 మంది విద్యార్థులు పాఠశాలల్లో చదువుతున్నారు. మైదానాలు లేని పాఠశాలల్లో అత్యధికంగా పీఎస్, యూపీఎస్‌ పాఠశాలలే ఉన్నాయి. 2 29 ఉన్నత పాఠశాలల్లో 42 పాఠశాలల్లో మైదానాల్లేవు. దీంతో విద్యాశాఖ నిర్వహించే స్కూల్‌ గేమ్స్, కేలో ఇండియా వంటి పోటీలకు ఎక్కువగా క్రీడా మైదానాలు ఉన్నటువంటి పాఠశాలల నుంచే ఎంపిక అవుతున్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు జరిగే ఈ పోటీల్లో అండర్‌–16 పోటీలకు మాత్రమే విద్యార్థులు ఎంపిక అవుతున్నారు. ప్రాథమిక ,ప్రాథమికోన్నత తరగతుల నుంచి విద్యార్థులు ఎంపిక కావడం చాలా అరుదని అధికారులు అంటున్నారు. పాఠశాలల్లో క్రీడలు నేర్పించే పీఈటీ, పీడీలు ఉన్నత పాఠశాలల్లో మాత్రమే ఉన్నారు. అది కూడా అన్ని పాఠశాలల్లో కాకుండా కేవలం 126 పాఠశాలల్లోనే పనిచేస్తు న్నారు. జిల్లా వ్యాప్తంగా 138 పోస్టులు మంజూరు కాగా దాంట్లో 126 మంది పీఈటీ, పీడీలు మాత్రమే ఉన్నారు. 12 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మరో 103 పాఠశాలల్లో క్రీడోపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా విద్యాశాఖ, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్యలో క్రీడాపోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీలకు ప్రభుత్వ పాఠశాలల నుంచి 80 శాతం మంది విద్యార్థులు ఎంపిక అవుతుండగా…ప్రైవేట్‌ పాఠశాలల నుంచి కేవలం 20 శాతం మంది విద్యార్థులు మాత్రమే వస్తున్నారని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థుల్లో ఎక్కువ మంది అండర్‌–14, అండర్‌–16 పోటీలకే ఎంపిక అవుతున్నారు. క్రీడామైదానాలు, క్రీడోపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాలల విద్యార్థులే క్రీడల్లో రాణిస్తున్నారని అధికారులు చెప్తున్నారు. ప్రతి యేటా జరిగే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఎంపికల్లో కూడా వారిదే పైచేయిగా ఉం టోందని అంటున్నారు.కబడ్డీ, ఖోఖోవంటి ఆటల్లో జాతీయ స్థాయి వరకు వెళ్లిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *