Home > Crime > శిరీష మృతిపై పోలీసుల క్లారటీ

శిరీష మృతిపై పోలీసుల క్లారటీ

డీఎస్పీ జేబుకే కన్నం వేశాడు.. 90 వేలు కొట్టేశాడు
పూరీ అసిస్టెంట్ పేరుతో ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్లు వాడేశాడట

Murders_Apduniaబ్యూటీషియన్  శిరీష కేసులో పోలీసులు ఓ క్లారిటీకి వచ్చినట్టు కనిపిస్తోంది. మొదట  ఆత్మహత్యగా..తర్వాత అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరికొద్దిసేపట్లో ఈ కేసు వివరాలు బయటపెట్టనున్నారు పోలీసులు. ఈ కేసులో శిరీష స్నేహితులు రాజీవ్, శ్రవణ్ లను అరెస్ట్ చేశారు. వీళ్లపై 304బి, 306 సెక్షన్ల కింద కేసులు పెట్టారు పోలీసులు.మూడు రోజుల కింద హైదరాబాద్  జూబ్లీహిల్స్  ఆర్ జే ఫొటోగ్రఫీ స్టూడియోలో శిరీష అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. మొదట్ల ఆమెది ఆత్మహత్యగానే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టంలో ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమెది హత్య అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేశారు. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, విచారణలో తేలిన అంశాలు, ఫోరెన్సిక్  నివేదిక ఆధారంగా శిరీష కేసుకు ఫుల్ స్టాప్ పెట్టనున్నారు సిటీ పోలీసులు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం.. శిరీష కేసులో ప్రభాకర్ రెడ్డి పేరు వినిపించడంతో..పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. పోలీసుల ప్రెస్ మీట్ తో పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *