Home > Crime > చిన్నపిల్లలు పాలు తాగాలి బాబూ.. మందు కాదు..

చిన్నపిల్లలు పాలు తాగాలి బాబూ.. మందు కాదు..

24 అవర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు
తల్లిని తోసి చంపేసిన కోడుకు

anchor-pradeep-apdunia-యాంకర్ ప్రదీప్‌పై పోస్ట్‌కు పోలీసుల స్పందన!

తెలియక చేసిన తప్పుకు ప్రదీప్‌ను వదిలేయాలంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టులకు పోలీసులు వెరైటీగా స్పందించారు. ఆయన తాగింది పాలు కాదని, మందు అని పేర్కొన్నారు. న్యూ ఇయర్ జోష్‌లో భాగంగా గతేడాది డిసెంబరు 31న టీవీ వ్యాఖ్యాత ప్రదీప్ ఫుల్లుగా మందుకొట్టి కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. మోతాదుకు మించి తాగడంతో రెండు నుంచి వారం రోజుల శిక్ష పడే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి.అయితే అంతకుముందు కౌన్సెలింగ్‌కు రావాలంటూ పోలీసులు ప్రదీప్‌ను పిలిచారు. అయితే, ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో అతడు పరారీలో ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. దీంతో స్పందించిన ప్రదీప్ ఓ వీడియోను విడుదల చేస్తూ, తాను షూటింగులతో బిజీగా వున్నానని, త్వరలోనే పోలీసుల ఎదుట హాజరవుతానని ప్రకటించాడు.కాగా, ప్రదీప్ తెలియక తప్పు చేశాడని పేర్కొంటూ హైదరాబాదు ట్రాఫిక్ పోలీసుల ఫేస్ బుక్ పేజీలో హనీ భవాని పేరుతో ఒకరు పోస్టు పెట్టారు. ‘సార్.. మా ప్రదీప్‌ను ఒగ్గేయండి.. పాపం చిన్నపిల్లాడు.. తెలియక తప్పుచేశాడు’ అంటూ ఆ పోస్టులో రిక్వెస్ట్ చేశారు. దీనికి స్పందించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ‘ప్రదీప్ చిన్నపిల్లాడైతే పాలు తాగాలి కానీ, మందు తాగాడు. మందు కొట్టి వాహనం నడపడం కరెక్ట్ కాదు. సెలబ్రిటీలు అందరికీ ఆదర్శంగా ఉండాలి’’ అని రిప్లై ఇచ్చారు. ఇప్పుడీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా తాను ఎక్కడికీ పారిపోలేదని ప్రదీప్‌ తెలిపాడు. ‘ డిసెంబర్‌ 31 నాటి ఘటన విచారకరం. నేను డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిబంధనలు ఉల్లంఘించిన మాట వాస్తవమే. తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నా. నేను చేసిన తప్పు మరెవరూ చేయకూడదు. నాపై అనేక అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయి. ఎవరూ నమ్మవద్దు. ముందస్తుగా అంగీకరించిన కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నా. పోలీసుల సూచనల మేరకు కౌన్సిలింగ్‌కు హాజరవుతానని వీడియోలో పేర్కొన్నాడు ప్రదీప్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com