Home > Editorial > రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు

రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు

పాకిస్తాన్ లో కలసి రాని పదవులు
బీహార్ లో సంప్రాదాయాలకు తిలోదకాలు
 
polotical_apduniaమొన్న బీహా్ర్, నిన్న గుజరాత్  రాష్ట్రాల్లో  బీజేపీ దూకుడు దీర్ఘకాలంలో  పార్టీని ఇబ్బంది పెట్టేవిగానే ఉన్నాయి.సమాజ స్వభావానికి అనుగుణంగా తాము వ్యవహరించవలిసిందే తప్ప సమాజంపై తమ సిద్ధాంతాలు రుద్దడం ఏ పార్టీకి సాధ్యం కాదు. భారతీయ సమాజంలో భిన్నత్వం ఎక్కువ కనుక ఉదారవాద స్వభావం కలిగి ఉంటుంది. లౌకిక ప్రజాస్వామ్య భావజాలం కూడా పాతుకుపోయి ఉన్నది.బీజేపీ ఇంకా వాఘేలా, నితీశ్ వంటి నాయకులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడవలసి వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా దీర్ఘకాలం దేశాన్ని పాలించడం ఇక ముందు ఏ జాతీయ పక్షానికి సులభం కాదు. కాంగ్రెస్ బలహీనపడితే ఆ శూన్యాన్ని ప్రాంతీయ పక్షాలు భర్తీ చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు తమ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. ప్రాంతీయ స్పృహను సరైన కోణంలో అర్థం చేసుకోవాలే తప్ప, జాతీయ సమైక్యతకు వ్యతిరేకమైనదిగా ముద్ర వేయకూడదు. భవిష్యత్తులో ప్రాంతీయ అస్తిత్వ భావనలు ఇంకా బలంగా వినబడవచ్చు. ఈ భిన్నస్వరాలను ఎంతగా ఆస్వాదిస్తే, జాతీయ సమైక్యత అంతగా బలపడుతుంది.సార్వత్రిక ఎన్నికలు ఇంకా రెండేండ్లు కూడా లేకపోవడంతో, వివిధ రాష్ర్టాలలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. బీహార్‌లో రాతోరాత్ యూపీఏ ప్రభుత్వం కూలిపోయి తెల్లారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డది. గుజరాత్‌లో పటీదార్ల ఆందోళన మొదలుకొని అనేక కారణాలు బీజేపీ వ్యతిరేక పరిస్థితిని సృష్టించడంతో కాంగ్రెస్ లాభపడుతుందనే అభిప్రాయం ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీకి శంకర్ సింగ్ వాఘేలా రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టుకున్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌కు మళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుజరాత్‌లో బీజేపీ తెరచాటు రాజకీయం ఎంత జోరుగా నడుస్తున్నదో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వెల్లడైంది. యూపీ, బీహార్, గుజరాత్ వంటి రాష్ర్టాలలో బీజేపీ బలంగా ఉన్నది కనుక పావులు కదపడం, ఆట కట్టడం తేలిక. కానీ అదే ఆట హిందీయేతర రాష్ర్టాలలో చెల్లుబాటవుతుందా అనేది సందేహమే. ప్రత్యేకించి దక్షిణాదిన అడుగు పెట్టడం, నిలదొక్కుకోవడం అంత సులభం కాదని తమిళనాడు పరిణామాలు గమనిస్తే అర్థమవుతుంది. జయలలిత మరణం తరువాత, అక్కడి రాజకీయాలను ప్రభావితం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. కానీ బహిరంగంగా బయట పడటానికి సాహసించడం లేదు. ఏదో ఒక తమిళ రాజకీయపక్షాన్ని ముందు పెట్టుకొని మాత్రమే వ్యవహరిస్తున్నది. బీజేపీ రజనీకాంత్‌ను చేర్చుకొని కొన్ని చిన్నాచితక పార్టీలను కూడ గట్టి పోటీ లో నిలుస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఈ ప్రయోగం విజయవంతం అవుతుందనే ధీమా బీజేపీలో, రజనీకాంత్‌లో కనిపించడం లేదు. డీఎంకేకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న మరో సూపర్‌స్టార్ కమల్ హాసన్ ఇప్పట్లో ఏ నటుడూ రాజకీయాల్లో ప్రవేశించడానికి తగిన పరిస్థితులు లేవని తేల్చి చెప్పారు.తమిళనాడులో 1967 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దేశ రాజకీయాలలో చరిత్రాత్మక ఘటనగా చెప్పుకోవచ్చు. ఐదు దశాబ్దాల తరువాత జాతీయ రాజకీయపక్షాలకు ఉన్న పరిమితులు, ప్రాంతీయ పార్టీలకున్న అనుకూలత మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమిళ ప్రజల ముందుకు ఇప్పటికీ బీజేపీ ధైర్యంగా వెళ్ళలేకపోతున్నది. భారతీయ సమాజం ఏకశిలా స్వరూపం అనే మౌలిక భావనతో బీజేపీ ముందుకుపోతే, బహుళత్వ సమాజం నుంచి సవాళ్ళు ఎదురవుతయి. ఇప్పుడు కర్ణాటక లో ఇదే పరిస్థితి ఏర్పడ్డది. వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని, తమ గెలుపు ఖాయమని బీజేపీ ఇప్పటివరకు భావించింది. కర్ణాటక జనాభాలో 20 శాతానికి పైగా ఉన్న లింగాయతులు బీజేపీ వైపు ఉండటం ఆ పార్టీ పెద్దల ఆత్మవిశ్వాసానికి కారణం. కానీ హటాత్తుగా కర్ణాటక రాజకీయ చిత్రం మారిపోయింది. లింగాయతులు తమను హిందువుల్లో భాగంగా కాకుండా, ప్రత్యేక మతం గా గుర్తించాలని కోరుతున్నారు. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు కులవ్యవస్థ వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకం గా ఉద్యమించిన ఆయనను అనుసరించిన వారే లింగాయతులు. వైదిక మత శాఖలలో ఒకటైన వీర శైవానికి తమకు సంబంధం లేదని వీరు అంటున్నారు. సిక్కు, జైనం మాదిరిగా వైదిక విశ్వాసాలకు తమ మతం భిన్నమైనదని లింగాయత పీఠాధిపతులు అంటున్నారు. ఇటీవల బీదర్‌లో జరిపిన లింగాయత మహాసభకు రెండు లక్షల మంది హాజరయ్యారు. వీరి డిమాండ్లను కేంద్రానికి పం పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంటున్నా రు. దీనివల్ల లింగాయతుల మద్దతుపై ఆశ పెట్టుకున్న బీజేపీ ఇరుకున పడ్డది.కాంగ్రెస్ పార్టీ ఉదారవాద ప్రజాస్వామిక స్వభావం కలిగి ఉండటం వల్లనే ఇం తకాలం నిలబడగలిగింది. సంక్షేమ పథకాలు, స్వావలంబన విధానాలు ఆ పార్టీ ఆర్థిక దృక్పథాన్ని ఇచ్చాయి. కాంగ్రెస్ బలహీనపడే క్రమంలో బీజేపీ వాజపేయి వంటి నాయకుడిని ముందు పెట్టుకొని నిలదొక్కుకోగలిగింది. కానీ గోరక్షకులు, యోగి ఆదిత్యనాథ్‌లు ముందుకు వచ్చినప్పుడు అదే స్థాయిలో ఆమోదనీయత లభించడం కష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *