Home > Editorial > తీవ్ర మౌతున్న కాలుష్యం…

తీవ్ర మౌతున్న కాలుష్యం…

మోడీకి రెండు రాష్ట్రాల అగ్ని పరీక్షే
పిల్లల పాలపై దందా

polution-apduniaమూడింటి మొత్తం మరణాలకంటే మూడురెట్లు ఎక్కువ. దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యానికి తీవ్రంగా గురై పొగమంచు ఆకాశాన్ని దుప్పటిలా కప్పేసిన తరుణంలోనే వాతావరణ కాలుష్యంపై అధ్యయన నివేదిక వెలువడి దేశంలో కాలుష్యం తీవ్రతను గుర్తు చేస్తోంది. 2015లో కాలుష్య సంబంధమైన మరణాలలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో భారత్ ఉందని ఆ నివేదిక హెచ్చరిస్తోంది. కాలుష్యం, ఆరోగ్యంపై లాన్సెట్ కమిషన్ ఈ అధ్యయనం జరిపి నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం 2015లో దేశంలో 25 లక్షల మంది కాలుష్యం బారిన పడి మరణించారు. ఇందులో వాయు కాలుష్యానికి ప్రాణాలు పోయినవారు 1.81 మిలియన్ మంది కాగా, నీటి కాలుష్య మరణాలు 0.64 మిలియన్లు. ప్రపంచవాప్తంగా సంభవిస్తున్న అన్ని రకాల మరణాలు ఆరింటిలో ఒకటి కాలుష్యం వలన సంభవిస్తోంది. కాలుష్య మరణాలో సుమారు 90శాతం పారిశ్రామికీకరణ వేగంగా చోటు చేసుకొంటున్న భారత్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ , మడగాస్కర్, కెన్యా దేశాలలోనే సంభవిస్తున్నాయి. ప్రపంచీకరణ వలన గనుల త్రవ్వకం, వస్తూత్పత్తి రంగాలు పేద దేశాలకు బదిలీ అయ్యాయి. ఆ దేశాలలో పర్యావరణ పరిరక్షణ నియంత్రణలు, వాటి అమలు కనాకష్టంగా ఉన్నట్లు ‘ప్యూర్ ఎర్త్’ అనే పర్యావరణ బృందం సలహాదారు కార్తి శాండిల్య తెలిపారు. పేద దేశాలలో కార్మికులు పని ప్రదేశాలలో, పనికి వెడుతూ కాలుష్యానికి గురవుతున్నారని ఆయన చెప్పారు.వారు నడుస్తున్నా, బైక్‌పై వెళ్లినా, బస్సులో ప్రయాణించినా కాలుష్యానికి గురవుతున్నట్లు ‘ ప్యూర్ ఎర్త్’ తెలిపింది. ఉదాహరణకు న్యూఢిల్లీలో కట్టడపు పనివారు తీవ్రంగా కాలుష్యం బారిన పడుతున్నారు. చాలా ఏళ్ల పాటు తీవ్ర వాయు కాలుష్యానికి గురవడం వల్ల ఊపిరితిత్తులు చెడిపోతాయి. అందువల్ల శ్వాస సంబంధమైన వ్యాధు లు ముదిరి మరణం కూడా సంభవిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్‌డిటివి తెలిపిన ప్రకారం ఈ అధ్యయనం రెండేళ్లపాటి సాగింది. ఆ ప్రాజెక్టులో దాదాపు 40మంది అంతర్జాతీయ ఆరోగ్య, పర్యావరణ నిపుణులు పాలు పంచుకొన్నారు. ఫిలిప్ లాండ్రిగన్ అనే పర్యావరణ నిపుణుడు, రిచర్డ్ ఫుల్లర్ అనే ‘ ప్యూర్ ఎర్త్’ వ్యవస్థాపకుడు సారథ్యం వహించారు. ఆయన ఆరోగ్య, పర్యావరణ ప్రపంచ కూటమి సెక్రటేరియట్ వ్యవస్థాపకులు కూడా. ఆ నివేదికను కూర్చిన వారిలో పర్యావరణ శాఖ మాజీమంత్రి జై రామ్ రమేష్ , ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ ముఖేష్ ఖారే కూడా ఉన్నారు. భారతదేశంలో 2015లో సంభవించిన కాలుష్య మరణాలలో పని ప్రదేశంలో కాలుష్యంవల్ల మరణాలు 17వేలు కాగా, సీసం కాలుష్యం వల్ల సంభవించినవి 95,000 అని లాన్సెట్ అధ్యయనం తెలిపింది. ఈ సమస్యపట్ల కొత్త దృష్టితో చర్యలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజా అధ్యయనంలో వెల్లడైన అంశాలు సమస్య తీవ్రతకు అద్దంపడుతున్నాయని వారు ఆందోళన ప్రకటించారు.అత్యవసర ప్రాతిపదికపై కాలుష్య నివారణ వ్యూహాలను ప్రభుత్వం చేపట్టాలని, లేకపోతే సామాన్య మానవులకు ప్రాణాంతకంగా కాలుష్యం సమస్య పరిణమిస్తుందని నిపుణులు హెచ్చరించారు. ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతంలో ఈ నెల ఆఖరుదాకా బాణసంచా అమ్మకాలను ఇటీవల సుప్రీంకోర్టు నిషేధించడం బట్టి ఇది ఎంత తీవ్ర సమస్యో అర్థమవుతోంది. ముఖ్యంగా దీపావళి రోజుల్లో ఢిల్లీలో వాయుకాలుష్యం మితిమీరుతోంది. నగరంలో చాలాచోట్ల సాధారణ స్థాయి వాయు కాలుష్యం దీపావళి రోజుల్లో మించిపోతుంది. ఢిల్లీలో గాలిలో ధూళికణాల (పిఎం 2.5, పిఎం 10) స్థాయి ఆందోళనకరంగా ఇటీవలికాలంలో పెరిగింది. పిఎం 10 స్థాయి కంటే పిఎం 2.5 స్థాయి మరింత తీవ్రమైనట్లు వాతావరణ అధ్యయన సంస్థలు తెలిపాయి. ఆ నగరంలో వాయువు నాణ్యత విపరీతంగా పడిపోయినట్లు కూడా అవి తెలిపాయి.మన దేశంలో మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగాలేకపోవడంతో నీటికాలుష్యం దేశంలో ముదురుతోందని నిపుణులు చెబుతున్నారు. నియమాలు పట్టించుకోని చిన్నస్థాయి పారిశ్రామిక సంస్థలు కూడా తూముల ద్వారా రసాయనాలతో నిండిన నీటిని రోడ్ల మీదకు ప్రవహింప చేస్తున్నాయి. దేశంలో అనేక నదులు, సరస్సులు, కాలువలలో కలుషిత జలాలు ప్రవహిస్తున్నాయి. దీనికి నీటిని శుద్ధి చేయకపోవడమే పెద్ద కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇవి మంచినీటి కాల్వల్లో కూడా కలిసిపోయి ఆరోగ్యానికి చేటు తెస్తున్నాయి. మురుగు శుద్ధి కర్మాగారాలు తగినన్ని లేకపోవడం ఈ సమస్యకు ముఖ్యకారణం. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇటువంటి కర్మాగారాలు అనేకం మూతపడ్డాయి. వాటికి తగినంత విద్యుత్ సరఫరా లోపిస్తోంది. ఉద్యోగులు సరిగా వేళకు రావడం ఆ కర్మాగారాల్లో అరుదు. అందుచేత చాలా చోట్ల మురుగు నీరు భూమిలోకి ఇంకిపోవడమో, ఆవిరయి గాలిలో కలవడమో జరుగుతోంది. మన దేశంలో 3,119 పట్టణాలు, నగరాలకు కలిపి కేవలం 209 మురుగు శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. అవి కూడా పాక్షికంగా పనిచేస్తున్నాయి. 1992లో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ వివరాలు వెల్లడించింది.

పట్టణాలలో వాయుకాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం వాహనాల రద్దీ అని తేలింది. పాతబడిన వాహనాలు వాడడం, రద్దీ వల్ల వేగం తగ్గడం కారణంగా వాయు కాలుష్యం 8 రెట్లు పెరుగుతోందని వారు చెప్పారు. వాహనాల రద్దీ వల్ల కర్బన ఇంధనాలు అధికంగా ఖర్చు అవుతాయని వివరించారు. ఢిల్లీతోపాటు దేశంలోని పట్టణప్రాంతాల్లో వాయు కాలుష్యానికి ఇంధనం కాలడం, పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టడం, వాహనాల రద్దీ మూల కారణాలు. ముఖ్యంగా శీతాకాలం సమీపిస్తుండగా ఈ సమస్య మొదలయి శీతాకాలంలో ముదురుతోంది. పొలాల్లో పంట తాలూకు వ్యర్థాలను పెద్దగా తగులబెట్టడం సమస్య ఈ కాలంలో తీవ్రమవుతోంది. చైనా, అమెరికా తర్వాత మనదేశంలో తలసరి వాయు కాలుష్యం అత్యధికం. 2013లో జరిగిన ఓ అధ్యయనంలో మన దేశం యూరప్‌తో పోలిస్తే 30 శాతం అధికంగా ఊపిరి తిత్తుల వ్యాధులతో బాధపడుతున్నట్టు తేలింది. 1981లో వాయుకాలుష్య నియంత్రణ, నివారణ చట్టాన్ని రూపొందించారు. అయినప్పటికీ 2016 పర్యావరణ సూచి క ప్రకారం భారతదేశం మొత్తం 185 దేశాలలోకీ141వ స్థానంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గోబర్ గ్యాస్ కోసం తయారు చేసే జీవ పదార్థాల ముద్ద నుంచి వాయుకాలుష్యాలు వ్యాపిస్తున్నట్టు ఒక శాస్త్రీయ అధ్యయనంలో తేలింది. ఆ ముద్దను పేడ, ఆకులు అలములు, చెత్తా చెదారం కలిపిన మిశ్రమంతో తయారు చేస్తారు. కాలుష్య సమస్య లక్షలాదిమంది మరణాలకు దారితీస్తున్న విషయాన్ని తీవ్రంగా పరిగణించి తక్షణమే ప్రభుత్వం రంగంలోకి దిగుతుందని నిపుణులు ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com