Home > Politics > సీఎం దద్దమ్మ : మాజీ ఎంపీ పొన్నం

సీఎం దద్దమ్మ : మాజీ ఎంపీ పొన్నం

చంద్రబాబు పోరాటం చేయాలి : ఉండవల్లి
రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు : కేవీపీ

ponnam-prabhakar-apduniaకేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు అన్యాయం చేయడంలో బీజేపీ , టిఆర్ఎస్ లు తోడుదొంగలుగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సోమవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు. దద్దమ్మలాగా కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం కాకుండా బయటికి రావాలని అన్నారు. రైతులకు మద్దతు ధరపై ఎందుకు కేసీఆర్ స్పందించరు. విభజన చట్టం లోని హామీలపై కేంద్రంపై ఎందుకు వత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. ఎంపీలు ఎందుకు పార్లమెంట్ ను స్థంబింపజేయడం లేదు. పార్లమెంట్ లో ఒక్కరోజుకోడా నిరసన గళం విప్పలేక పోతున్నారని అన్నారు. మీకు తెలివిలేక పొతే .. గతంలో పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీ ల పోరాటాలను చూసి నేర్చుకోండి. టిఆర్ఎస్ బీజేపీ తో లోపాయకారి ఒప్పందాలా .. లేక కేసీఆర్ పై సీబీఐ కేసులు అడ్డమోస్తున్నాయా అని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్ లో ధర్నా చెయ్యి. మేము కలిసి వస్తామన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఎందుకు నోరుమెదపరు. ఏఒక్క హామీని రాష్ట్రానికి సాధించలేనప్పుడు తెలంగాణ లో బీజేపీ కార్యాలయం ఎందుకు .. తాళం వేసుకోండని అన్నారు. బీజేపీ టిఆర్ఎస్ లు మీ రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి .. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడక పొతే జనం నుంచి ప్రతిఘటన తప్పదు. సీఎం ను దద్దమ్మ అన్నందుకు నాపై కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు నేను సిద్ధమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *