Home > Crime > సంధ్యారాణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

సంధ్యారాణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

ఆస్ట్రేలియాలో తెలంగాణ వాసి అనుమానాస్పద మృతి
పరారీలో వనితారెడ్డి....

sandhya-rani-apduniaప్రేమోన్మాది కార్తీక్ దాడిలో గాయపడి మరణించిన సంధ్యారాణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. శుక్రవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలో సంధ్యారాణి మృతదేహానికి శవపరీక్ష చేశారు. శవపరీక్ష పూర్తయిన తరువాత సంధ్యారాణి మృతదేహాన్ని పోలీసులు ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు.తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కారణంతో సంధ్యారాణిపై దాడి చేసినట్లు నిందితుడు కార్తీక్ అంగీకరించాడు. గురువారం రాత్రి సంధ్యారాణిపై కార్తీక్ పెట్రోల్ పోసి నిప్పింటించాడు. ఈ ఘటనలో సంధ్యారాణి చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించింది. ఈ మేరకు కార్తీక్ నుఅదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఐదేళ్లుగా సంధ్యారాణిని ప్రేమిస్తున్నానని, తనకు ఉద్యోగం ఇప్పించింది కూడా తనేనని పోలీసులకు తెలిపాడు. ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నామన్నారు. కానీ గత కొంతకాలంగా సంధ్యారాణి ప్రవర్తనలో మార్పు వచ్చిందని, తనను దూరం పెట్టిందని పేర్కొన్నాడు. సంధ్యకు ఫోన్ చేస్తే వాళ్ల సహోద్యోగితో మాట్లాడించిందని, సంధ్య జోలికి రావొద్దని, ఫోన్ చేయొద్దని నన్ను అతను బెదిరించాడని కార్తీక్ వెల్లడించారు. సహోద్యోగితో సంధ్య సన్నిహితంగా ఉండటాన్ని తట్టుకోలేకపోయానని, నన్ను దూరం పెడుతోందనే అనుమానం వచ్చిందని అన్నాడు. నిన్న రాత్రి కూడా సంధ్యారాణిని పెళ్లి చేసుకుందామని బతిమిలాడానని, అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై దాడికి పాల్పడ్డానని పోలీసుల ముందు అంగీకరించాడు. గాంధీ ఆసుపత్రి మార్చరీ వద్ద సంధ్య తల్లి కుటుంబ సభ్యులు అరణ్య రోదనలు. వారిని ఓదార్చడం ఎవరి తరము కాలేదు కార్తీక్ కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోనున్నట్లు నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు. సంధ్యారాణి ఉదయం 7 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. ప్రేమోన్మాది కార్తీక్ను విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు కార్తీక్ పై 307, 354డీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com