Home > Movies > సిల్వర్ స్క్రీన్ మీదకు ప్రదీప్

సిల్వర్ స్క్రీన్ మీదకు ప్రదీప్

సెకండ్ మ్యారేజ్ కి రేణు రెడీ
‘జంధ్యాల రాసిన ప్రేమకథ’ సెన్సార్ పూర్తి, 24న విడుదల
 
pradeepతెలుగు నాట బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు. హుందాగా ఉంటూ, తనదైన శైలిలో ఆకట్టుకునే యాంకర్‌గా అతడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాప్ యాంకర్ అతడు. ప్రదీప్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. బుల్లితెర మీద సత్తా చాటిన ప్రదీప్ వెండితెరపై కూడా మెరవబోతున్నాడట. ఇప్పటికే అతడు కొన్ని సినిమాల్లో నటించాడు. కానీ హీరోగా మాత్రం చేయలేదు.త్వరలోనే ఓ సినిమాలో హీరోగా ప్రదీప్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. డాన్స్ కొరియోగ్రాఫర్‌గా పేరున్న అజయ్ సాయి మణికందన్ దర్శకత్వంలో ప్రదీప్ సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ‘గడసరి అత్త సొగసరి కోడలు’, ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’ లాంటి ప్రోగ్రాల ద్వారా మహిళా ప్రేక్షకులకు ప్రదీప్ దగ్గరయ్యాడు. దీంతో తన కామెడీ టైమింగ్, ఆడవాళ్లు ఇష్టపడే ఫ్యామిలీ సెంటిమెంట్ లాంటి అంశాలకు ఆ చిత్రంలో పెద్ద పీట వేస్తారట.ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాగా, వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి అధికారికంగా ఈ సినిమాను ప్రారంభిస్తారని తెలుస్తోంది. హీరోగానూ ప్రదీప్ చక్కటి విజయాల్ని అందుకోవాలని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *