Home > Vanitha > సెల్ఫ్ రెస్పెక్ట్ కు ప్రాధన్యం

సెల్ఫ్ రెస్పెక్ట్ కు ప్రాధన్యం

ములక్కాడ ఇగురు
కళే ప్రాణం పొసింది...
 
sneha_apduniaఉన్నత చదువులు చదివి సొంత కాళ్ల మీద నిలబడాలనుకునే అమ్మాయిల సంఖ్య పెరిగింది. ఎవరిపై ఆధారపడకుండా తామే కొంతమందికి ఉపాధి కల్పించాలనుకునే వాళ్లు ఎక్కువయ్యారు. స్నేహా కూడా అలాంటి అమ్మాయే!స్నేహ ఒక లక్ష్యం కోసం, ఒక గమ్యం కోసం పగలంతా చదువుతూ, రాత్రిపూట పరోటాలమ్ముతున్నది. స్నేహా లింబ్గా ఓంకార్, ప్రేమ్ శంకర్ మందల్ అనే యువకుడిని ప్రేమించింది. వీరిద్దరి వివాహానికి పెద్దలు నిరాకరించారు. ప్రేమ్ శంకర్‌ది జార్ఖండ్. 15ఢిల్లీలోని సీఏజీ ఆఫీస్‌లో ఉద్యోగం. స్నేహది మహారాష్ట్ర. వీళ్లిద్దరి పరిచయం ముంబైలో ఏర్పడింది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని కేరళ వెళ్లి స్థిరపడాలనుకున్నారు. చేతిలో చిల్లి గవ్వలేదు. కానీ ఉన్నత చదువులు చదివి జర్మనీ వెళ్లాలనేది స్నేహా లక్ష్యం. ఆ గమ్యాన్ని తాకే ప్రయత్నంలో కేరళ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ ఫెలోషిప్‌గా సీటు 
సాధించింది.బతకాలంటే ఏదో ఒక పని చేయాలి కాబట్టి తిరువనంతపురంలోని ఐటీ హబ్ టెక్నోపార్క్ పక్కన మొబైల్ క్యాంటీన్ తెరిచింది. స్నేహ చదువుల కోసం ప్రేమ్ శంకర్ రోజంతా అక్కడ కష్టపడేవాడు. ఉదయం అంతా చదువుకుని రాత్రిపూట స్నేహ కూడా మొబైల్ క్యాంటీన్‌లో పరోటాలు చేసేది. ఓవైపు చదువుకుంటూనే ఇల్లు గడవడం కోసం క్యాంటీన్ నడుపుడుతున్న వీళ్లిద్దరి గురించి తెలిసిన వాళ్లంతా ప్రశంసిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *