Home > General > సర్కారీ ఆఫీసులకు కరెంట్ ప్రీ పెయిడ్‌ మీటర్లు

సర్కారీ ఆఫీసులకు కరెంట్ ప్రీ పెయిడ్‌ మీటర్లు

డెంగ్యూ జ్వరాలతో కలవరం
నయా టెక్నాలజీతో ఆరు నెలల్లో బ్రిడ్జి

prepaid-electric-meeters-apduniaసెల్‌ఫోన్ మాదిరిగా ప్రీపెయిడ్ మీటర్లలో రీచార్జ్ చేయించుకుంటేనే విద్యుత్ ఉంటుంది.. దుబారాను, బకాయిదారులకు చెక్ పెట్టేందుకు విద్యుత్ శాఖ ప్రీపెయిడ్ మీటర్లను బిగించాలని నిర్ణయించింది. మరో పక్షం రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు బిగించే అవకాశం ఉంది.విద్యుత్ సంస్థ మొదటగా వినియోగదారులకు ప్రీపెయిడ్ మీటర్లు అందిస్తుంది. ఇందులో రెండు రకాల ఉపకరణాలు ఉంటాయి. ఒకటి మీటర్, రెం డోవది కస్టమర్ ఇంటర్ ఫేస్ యూనిట్. మీటర్‌లో ఫోన్‌లో ఉన్నట్లే కీప్యాడ్ ఉంటుంది. మీటర్ ఇచ్చే ముందు సర్వీసు సంఖ్య, వినియోగదారుడి పేరు, కోడ్ అందులో ఫీడ్ చేస్తారు. స్తంభం నుంచి వచ్చే విద్యుత్ తీగ మీటర్ వరకు వచ్చి ఆగుతుంది. విద్యు త్ రీచార్జీల విక్రయదారుడి వద్ద కార్డు కొనుగోలు చేస్తే 12 అంకెల సంఖ్య ఇస్తారు. ఆ సంఖ్యను నమో దు చేయగానే కొనుగోలు చేసిన మీటర్‌లోనికి విద్యు త్ సరఫరా అవుతుంది. ఇది ఒక విధానం.ఇంటర్ ఫేస్ యూనిట్ ద్వారా రీచార్జి ఇంటి నుంచే చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో నుంచే నెట్, వైఫ్ ద్వారా నేరుగా డెబిట్ లేక క్రెడిట్ కార్డులను ఉపయోగించి అవసరమైన మేర కు విద్యుత్ మీటర్‌ను రీచార్జి చేసుకోవచ్చు. మీటర్ లో ఎంత విద్యుత్ నిల్వ ఉందనే విషయాన్ని కూడా తెలుసుకునేందుకు మీటరులో గుర్తులుంటాయి. ఎక్కువగా నిల్వ ఉంటే ఆకుపచ్చ రంగు బల్బు వెలుగుతూ ఎంత విద్యుత్ ఉందో చూపిస్తుంది. ఎరుపు రంగు బల్బు కూడా ఉంటుంది. ఈ బల్బు నిల్వ డబ్బులు తగ్గిపోతున్న సమయంలో వెలుగుతూ వినియోగదారుడిని అప్రమత్తం చేస్తుంది.ప్రయోజనాలు.విద్యుత్ దుబారా అరికట్టి పొదుపు చేసే అవకా శం ఉంటుంది. విద్యుత్ ఆపరేటర్ల నిర్లక్ష్యంతో బిల్లు లు అధికంగా వచ్చే అవకాశం ఉండదు. బిల్లు చెల్లించకపోతే సరఫరాను నిలిపేసే అవకాశం ఉండదు.ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ముందుగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని శాఖ అధికారులు భావిస్తున్న ట్లు తెలుస్తోంది. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు భారీగా విద్యుత్ విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉం టున్నాయి. ఈ బిల్లులను నెలలు, ఏళ్ల తరబడి చెల్లించకపోవడంతో కోట్లలో బిల్లులు పేరుకుపోతున్నాయి. వీటి బిల్లుల వసూలు విద్యుత్ శాఖకు తలనొప్పిగా మారుతోంది. ప్రీపెయిడ్ మీటర్లు ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తే బిల్లుల వ సూలు సమస్యలు తీరిపోతాయి. తమ కార్యాలయాలకు అవసరమైన విద్యుత్‌ను అధికారులు బడ్జెట్ ఉన్నప్పుడే కొనుగోలు చేసి పెట్టుకునే అవకాశం ఉంటుంది.జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చెల్లించాల్సిన బిల్లులు భారీ స్థాయిలో పెండింగ్‌లో ఉం టున్నాయి. ఆయా శాఖల అధికారులు బిల్లుల చెల్లింపుల్లో తీవ్రమైన జాప్యం చేస్తున్న కారణంగా విద్యుత్ బిల్లులు మోయలేని భారంగా తయారవుతున్నాయి. జిల్లాలోని ముఖ్యమైన 12 శాఖల వి ద్యుత్ బకాయిలే సుమారు 21,66, 54,570 పేరుకుపోయాయి. ఈ బిల్లుల వసూలు విద్యుత్ శాఖకు గుదిబండగా మారిపోయింది. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో వీటిని అమర్చాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని ప్ర భుత్వ కార్యాలయాల వివరాలు, విద్యుత్ సర్వీస్ మీటర్ల వివరాలు సేకరించారు. ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల వినియోగం, ఉపయోగించే విధానం, ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి డెమో ఇచ్చిన తరువాత బిగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దు బారా అధికంగా ఉన్నట్లు గుర్తించిన ఉన్నతాధికారు లు.. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే వీటిని బిగించాలని భావిస్తున్నారు. దీనికి తోడు విద్యుత్ శాఖకు ఇతర ప్రభుత్వ శాఖల బిల్లులు పెండింగ్‌లో ఉండడం తలనొప్పిగా మారింది.. మీటర్ నుంచి కూడా బ్యాలెన్స్ యూనిట్లను తెలుపుతూ సంకేతాలు వస్తాయి. అందులో ఉన్న బ్యాలె న్స్ అయిపోక ముందే రీచార్జి చేసుకోకుంటే కరెంట్ కట్ అవుతుంది. అప్పుడు రీచార్జి చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *