Home > Bhakti > బోనాలకు సన్నాహాలు

బోనాలకు సన్నాహాలు

తిరుమలేశునికి ఊరట!
శ్రీవారూ పన్ను చెల్లించాల్సిందే
 
bonalu2_apduniaజ‌ంట న‌గ‌రాల్లో బోనాల పండుగ‌ను ఘ‌నంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక‌గా నిలిచే బోనాల పంగుడ‌ను ఈ సారి ప్రభుత్వం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహించ‌నుంది. బోనాల ఉత్సవాల్లో భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాల  ఏర్పాట్లపై స‌చివాల‌యంలో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం జరిగింది. బోనాల కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాట్లకుగానూ గ‌తంలో 5 కోట్లను కేటాయించ‌గా, ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ 10 కోట్లను మంజూరు చేశారు. న‌గ‌రంలోని అన్ని ఆల‌యాల‌ను బోనాల పండ‌గ‌కు స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబు చేస్తున్నారు. హైద‌ర‌బాద్ లో బోనాల పండగ అతి పెద్దద‌ని, తెలంగాణ‌లో బోనాల‌తోనే పండ‌గ‌లు ప్రారంభ‌మ‌వుతాయని,  ప్రశాంత వాతావ‌ర‌ణంలో బోనాలు జ‌రిగేలా ప్రభుత్వ ప‌రంగా అన్ని చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖ‌ల‌తో స‌మ‌న్వయం చేసుకుంటూ, బోనాల పండ‌గ‌ను విజ‌య‌వంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ 
సంఘ‌ట‌నలు జ‌ర‌గ‌కుండా పోలీసులు భ‌ద్రత ప‌రంగా అన్ని చ‌ర్యలు తీసుకుంటున్నారు. ఈ సారి కూడా బోనాల్లో డీజేకు అనుమ‌తి లేదు. మైకులనే వాడాలి. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ అమ్మవారికి బోనాలు స‌మ‌ర్పించే అంశాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని హోం మంత్రి నాయిని వెల్లడించారు. హైద‌రాబాద్ మ‌త సామ‌ర‌స్యానికి ప్రతీక‌ని, అన్ని వర్గాలు  సహకరించి బోనాలు శాంతియుతంగా జరిగేలా చూడాలని కోరారు. రంజాన్, క్రిస్మస్ తో పాటు ఇత‌ర మ‌తాల పండ‌గ‌లను కూడా ముఖ్యమంత్రి ఘ‌నంగా నిర్వహిస్తున్నార‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు. హైద‌ర‌బాద్ లో బోనాలు అతి 
ముఖ్యమైన ఘ‌ట్టమ‌ని, గ‌తేడాది లాగే ఈసారి కూడా బోనాల‌ను ఘ‌నంగా నిర్వహిస్తామ‌ని హైద‌రబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. బోనాల్లో పారిశుద్ద్యం, ప‌రిశుభ్రత , తాగు నీరు, విద్యుత్ తో పాటు ఇత‌ర సౌక‌ర్యాల‌పై ప్రధానంగా దృష్టి సారించామ‌న్నారు.  జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఉన్న అన్ని శాఖ‌ల స‌మ‌న్వయంతో బోనాల‌ను విజ‌య‌వంతంగా నిర్వహిస్తామ‌ని చెప్పారు. బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావ‌ర‌ణంలో జ‌రిగేలా అంద‌రు స‌హ‌క‌రించాల‌ని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *