Home > Tirumala News > తిరుమలకు నిషేధిత వస్తువులు

తిరుమలకు నిషేధిత వస్తువులు

శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌
వెంకన్న కాలి ముద్రే ఈ అలిపిరి పాదాలు
 
vigilence_apduniaవందల సంఖ్యలో సెక్యూరిటీ, ఎటు చూసినా నిఘా కెమెరాలు..ఎప్పుడూ హై అలర్ట్ ను తలపించేలా వాతావరణం..ఇంత జరుగుతున్నా తిరుపతి నుంచి తిరుమలకు మాత్రం యథేచ్ఛగా నిషేధిత వస్తువులు సరఫరా అవుతూనే ఉన్నాయి. భక్తుల ముసుగులో కొంతమంది నిషేధిత వస్తువులను ఆధ్మాత్మిక క్షేత్రానికి తరలించి పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలో తిరుమలకు నిషేధిత వస్తువుల అక్రమ రవాణా మరింత పెరిగింది. ఇంటి దొంగలే అక్రమ రవాణాకు సహకరిస్తుండడంతో యథేచ్ఛగా నిషేధిత వస్తువులు తరలిపోతున్నాయి. .ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతికి  ప్రతిరోజు వేలాదిమంది భక్తులు  వచ్చి వెళుతుంటారు. తిరుపతి లాంటి ప్రాంతంలో ఎప్పుడూ భద్రత కట్టుదిట్టంగానే ఉంటుంది. ఒకవైపు స్థానిక పోలీసులు మరోవైపు టిటిడి విజిలెన్స్, మరో వైపు సెక్యూరిటీ అధికారులు. డేగ కన్నుతో ఎప్పుడూ పహారా కాస్తుంటారు. తిరుపతి నుంచి తిరుమలకు మొత్తం మూడు మార్గాలు ఉన్నాయి. ఒకటి రోడ్డు మార్గం గుండా తిరుమలకు వెళ్ళొచ్చు. మరొకటి అలిపిరి పాదాల మండంపం నుంచి నడక మార్గం, మరొకటి శ్రీవారి మెట్ట మార్గం గుండా నడక మార్గం. ఈ మూడువైపుల నుంచి తిరుమలకు భక్తులు వెళుతుంటారు. తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే అనుమతిస్తుంటారు. తిరుమలలో మద్యం, మాంసం, గుట్కా, సిగరెట్, పాన్ పరాక్, గంజాయితో పాటు మరికొన్ని నిషేధిత వస్తువులు ఉన్నాయి.  కానీ కొంతమంది మాత్రం అవేవీ పట్టించుకోకుండా యథేచ్ఛగా వాటిని తరలించేస్తున్నారు. వీరికి కొంతమంది ఇంటి దొంగలే సహకరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. మాంసం, మద్యం లాంటివి తిరుమలకు తరలింపులో కొందరు కింది స్థాయి సిబ్బంది హస్తం కుడా వుందని అరోపణలు వున్నాయి. ఈ విషయం కాస్త నూతన చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ రవి కృష్ణ వరకు వెళడంతో అయన అధికారులను అలర్ట్ చేశారు.  ప్రతి భక్తుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే తిరుమలకు అనుమతించాలని ఆదేశాలిచ్చారు. దీంతో భక్తులు తీసుకొచ్చిన లగేజీ మొత్తాన్ని పరిశీలించిన తరువాతనే పంపిస్తున్నారు. అలా తనిఖీ సమయంలో కొంతమంది నిందితులు బయటపడుతున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయితో పాటు 29మద్యం బాటిళ్ళు, పదుల సంఖ్యలో గుట్కాలు, ఎండు చేపలను తీసుకెళుతూ అడ్డంగా దొరికిపోయారు. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను ఊపేస్తుంటే తిరుపతిలో పట్టుబడిన గంజాయి వ్యవహారం కూడా అదే స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *