Home > Crime > వామ్మో… గాంధీ ఆస్పత్రి

వామ్మో… గాంధీ ఆస్పత్రి

ఆబు సలేంకు జీవత ఖైదు
గౌరీ హత్యకేసు దర్యాప్తుకు సిట్ ఏర్పాటు

gandhi-hospital-apduniaరోగులు గాంధీ ఆసుపత్రికి రావాలంటే వణుకుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి చివరి ఊపిరితో అత్యవసర విభాగానికి చేరుకున్నా సకాలంలో వైద్యం అందక వ్యాధి నిర్ధారణ యంత్రాలు పనిచేయక ఎంతో మంది క్షతగ్రాతులు మృత్యువాత పడుతున్నారు. దీంతో రోగులు గాంధీ ఆసుపత్రి పేరు చెప్పగానే ‘అమ్మో గాంధీనా ఒద్దు’ అంటున్నారు. తప్పని పరిస్థితుల్లో ఏలాంటి ఆధారం లేని వారు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. ఒక్క ఈ ఏడాదిలోనే పరికరాలు పనిచేయక, లిఫ్ట్‌ల సమస్య, విద్యుత్ అంతరాయం తదితర సమస్యలతో సమయానికి వైద్యం అందక సుమారుగా వంద మందికి పైగా రోగులు మరణించారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు వైద్య సేవలు 24గంటలకు ఒక్కసారి మాత్రమే అందుతున్నాయి. దీంతో రోగులు ఇక్కడి నుంచి ఇతర ఆసుపత్రులకు వెళుతున్నారు.1255 పడకల సామర్థం ఉన్న గాంధీ ఆసుపత్రి ఔట్ పేషేంట్ విభాగానికి నిత్యం 2500 నుంచి -3000 మంది వస్తుండగా ఇన్ పేషెంట్ విభాగంలో 1500 మందికి పైగా చికిత్స పొందుతుంటారు. అత్యవసర విభాగానికి రోజుకు సగటున 200 మంది వస్తే వీరిలో 80శాతం రక్తమోడుతున్న వారే. వీరిలో చాలా మందికి సకాలంలో వైద్యసేవలు అందడంలేదు. నిపుణులు అందుబాటులో లేక కొంతమంది సిటీ, ఎంఆర్‌ఐ వంటి సేవలు అందక మరికొంత మంది చనిపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోందిగాంధీ ఆసుపత్రిలో యంత్రాలు ఎప్పుడు పని చేస్తాయో, ఎప్పుడు పనిచేయవో తెలియదు. ఈ యంత్రాలను అవగాహన లేనివారు కూడా ఆపరేట్ చేస్తుండటంతో రిపేర్‌కు వస్తున్నాయి. దీంతో వేలాది రూపాయాలు ఖర్చు చేసుకొని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. గాంధీలో ఉన్న ఎంఆర్‌ఐ యంత్రాని ఏవైనా మరమ్మతులు చేయాలంటే జర్మనీ నుంచి ప్రత్యేక నిపుణులు రావాల్సిందే. కానీ వారికి కూడా సకాలంలో నిర్వాహణ ఖర్చులు చెల్లించకపోవడంతో సదరు సంస్థ ప్రతినిధులు మరమ్మతులకు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. దీంతో రోగులు ఉస్మానియాతో పాటు తదితర ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను గాంధీ ఆసుపత్రికి వెళ్లమని తెలపడంతో సదరు రోగులు భయపడుతున్నారు. అంటే గాంధీలో నిత్యం జరుగుతున్న సంఘటనలు గుర్తిస్తున్న రోగులు ఇక్కడికి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. తప్పని పరిస్థితిలో వచ్చినా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వార్డులో మూలుగుతున్నారు. వార్డుల్లోకి వెళితే పడకలు లేక ఖాళీ అయ్యేంత వరకు వార్డు బయటే రోగులు నిద్రించాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని తెలంగాణ వైద్యారోగ్యశాఖ పదే పదే పలుకుతోంది. కానీ పభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం రోగులను కాటేస్తుంది. ఆసుపత్రిలోకి వెళ్లిన నాటి నుంచి కనీస సదుపాయాలు లేక ఆసుపత్రిలో రోగులు అల్లాడుతున్నారు. ఇక వైద్యసేవలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో దిక్కుతోచని స్థితిలో రోగులు ఆందోళన చెందుతున్నారు. గాంధీ ఆసుపత్రికి ప్రభుత్వం అన్ని విధాల నిధులను కేటాయిస్తున్నప్పటికీ ఆసుప్రతిలో ఇంతటి దుస్థితి ఎందుకని పలువురు రోగులు ప్రశ్నిస్తున్నారు.గాంధీకి వస్తున్న రోగుల పట్ల అక్కడి సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ కార్మికులు వేదిస్తున్నారు. వార్డులోపలికి వెళ్లాలంటే రూ.20 నుంచి 50 వరకు దర్జాగా దండుకుంటున్నారు. లంచాలు ఇవ్వని రోగుల సహాయకులకు సెక్యూరిటీ గార్డులు చిత్రహింసలు పెడుతున్నారు. చివరకు లాఠీకి కూడా పనిచెబుతున్నారు.గాంధీలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు వెక్కిరిస్తున్నాయి. ఈ ప్రభావం రోగులపై తీవ్రంగా పడుతోంది. ఇన్‌పేషంట్‌లకు వైద్యం సకాలంలో అందాలంటే నర్సుల పాత్ర కీలకం. కానీ ఇక్కడ నర్సుల ఖాళీలు ఎక్కువ ఉండటంతో ఇన్‌పేషేంట్‌లకు సరైనా వైద్యం అందడంలేదు. ఒక్క గాంధీలోనే 511మంది నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేంత వరకు రోగులు ఈ ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని తెలుస్తోంది.గాంధీలో రికార్డుల లెక్కకు 16 లిఫ్ట్‌లు కానీ అందులో రోగుల అవసరాలను తీరుస్తున్నవి కేవలం మూడే మూడు, నిర్వహణకు అతీగతీ లేదు. కనీసం రిపేరులో ఉన్నవాటి వద్ద హెచ్చరికల బోర్డులు గానీ, గార్డులు గానీ ఉండరు. ఫలితంగా నిత్యం గాంధీ ఆసుపత్రికి వచ్చే రోగులకు అవగాహన లేకపోవడంతో ఈ లిఫ్టుల్లో ఎక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గాంధీలో 25 కు పైగా జరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com