Home > Bhakti > కార్తీక మాసం… నదీ స్నానాలకు పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం… నదీ స్నానాలకు పోటెత్తిన భక్తులు

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
మహాంకాళికి ప్రత్యేక హారతి

lord-shiva-apduniaనేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తెల్లవారు జాము నుంచే శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో ఉన్న శివాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో శైవ క్షేత్రం అయిన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. శివనామస్మరణం తో శ్రీశైలం మారు మోగుతుంది. అలాగే కృష్ణమ్మ ఒడిలో స్నానామాచరించేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.భక్తుల కోసం ఘాట్ల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.అలాగే మహానంది ఆలయం దగ్గర కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు అలయాధికారులు.

కార్తీకమాసం శివునికి ప్రీతిపాత్రమైన నెల. ఈ నెలలో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే కోర్కెలు తీరుతాయన్నది ప్రగాఢ నమ్మకం. కార్తీక మాసంలో ప్రతి సోమవారం క్రమం తప్పకుండా భక్తులు ఉపవాసదీక్ష చేస్తారు. నెలలో ప్రతిరోజూ నదీ తీరంలో స్నానమాచరిస్తే ..పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. ఈ నమ్మకం ఆధారంగానే నదీతీరాలు భక్తులతో నిండిపోతాయి. ముఖ్యంగా సోమవారాలు కిటకిటలాడుతాయి. కార్తీకమాసం మొదటి రోజు కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులు నదీతీరానికి పోటెత్తారు. అన్ని ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు వివిధ ఘాట్ లకు చేరుకున్నారు. ఈరోజును మహా కార్తీకగా పిలుస్తారు పండితులు. తెల్లవారుజామునే నదులలో స్నానాలు చేస్తే .అష్టఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని అంటారు. ఈ కారణంతోనే వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో నోమును చేసుకుంటారు. శివుడిని కేదారేశ్వరుడిగా ఈరోజున పూజిస్తారు. నదీతీరంలో స్నానాల అనంతరం అన్ని శివాలయాల్లో ప్రత్యేకపూజలు జరుగుతాయి. ముఖ్యంగా శివాలయాల్లో సాయంత్రం జ్వాలాతోరణోత్సవం చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *