Home > General > బొ్ంగు చికెన్ కు ఫిదా అవుతున్న జనం

బొ్ంగు చికెన్ కు ఫిదా అవుతున్న జనం

పాముల మధ్యే జీవనం
కలకలం రేపుతున్న సెల్ఫీ సూసైడ్ నోట్

bambo-chicket-apduniaమాంసాహారంలో చికెన్‌ను రారాజుగా పిలులుస్తుంటారు. ఎందుకంటే చికెన్‌లో కల్తీ ఉండదు. మాంసంలో జరిగే కల్తీని పసిగట్టలేం. అందుకే హోటల్స్‌లో తినే భోజన ప్రియులు ఎక్కువగా చికెన్ ఐట మ్స్‌నే ఆర్డర్ చేస్తుంటారు. ఇప్పుడు చికెన్‌తో వినూత్నమైన వంటకాలు తయారు చేస్తున్నారు. అందులో భాగమే ‘బొంగు చికెన్’. బొంగులో వండే చికెన్‌కు భోజన ప్రియులు ఫిదా అవుతున్నారు. చికెన్‌కు మసాలా దట్టించి, బొంగులోకి దూర్చి, దా న్ని నిప్పుల మీద కాల్చడమే బొగు చికెన్ ప్రత్యేకత. దీని వల్ల కొవ్వు, నీరు అంతా వెలుపలికి వస్తుంది.అప్పుడు తయారైన చికెన్ భాగారా (ఫ్రైడ్) అన్నంలోకి లేదా వైట్ రైస్‌లోకి, లేదా చపాతితో లేదా కేవలం బొంగు చికెన్‌నే తింటుంటే ఆ రుచే వేరు. ఇప్పుడు నగర వాసులు బొంగు చికెన్‌కు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఏదైనా వంటకం దాని రుచి గురించి మిత్రులను అడిగినప్పుడు .. బాగా లేకపోతే బొంగు లెక్క ఉంది అనడం వింటుంటాం. ఇప్పుడు మాత్రం బొంగు వంటకం అంటే రు చికి పెట్టింది పేరనే చెప్పాలి.భద్రాచలం అడవుల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన లావుపాటి (వెదురు) బొం గులను.. బొంగు చికెన్ వండేందుకు ఉపయోగిస్తారు. వీటిని ఒక ఫీట్, ఫిట్‌న్నర, రెండు ఫీట్ల పొడవులో కట్ చేయించి తెచ్చుకుంటారు. కిలో చికెన్ తయారీకి ఒక ఫీట్ బొంగును ఉపయోగిస్తారు.బొంగు చికెన్ వండేందుకు నూనె, నీరు అ వసరముండదు. ఇవి లేకుండానే చికెన్‌ను శుభ్రంగా కడిగి, అల్లం వెల్లుల్లి, ఉప్పు, పసుపు, గరం మసాలాను కలిపి చికెన్‌ను నానన బెడుతారు. తర్వాత ఈ మిశ్రమా న్ని మోతుకు లేదా బాదం ఆకులతో కప్పి (చుట్టి) బొంగులోకి దూర్చి సన్నని సె గపై ఉడికిస్తారు.ఇలా ఉడికేప్పుడే కొవ్వు తదితర వ్యర్థమంతా వెలుపలికి వస్తుంది. సుమారు 45 నిముషాల పాటు నిప్పులపై కాల్చాక బొంగును చల్లారుస్తారు. అనంతరం బొంగులోనే ప్యాక్ చేసి ఇస్తారు. నూనె, నీరు లేకుండా నిప్పులపై వండే బొంగు చికెన్ అంటే ఇప్పుడు నగర వా సుల్లో క్రేజ్ ఏర్పడింది.ఇంటికి పార్శిల్‌గా తీసుకెళ్తూ కుటుంబ సమేతంగా బొంగు చికెన్ రుచులను ఆస్వాదిస్తున్నారు. చికెన్ తీసుకెళ్లి ఇస్తే, వండి ఇచ్చినం దుకు కేజీకి రూ.200,అరకిలోకు రూ.120చార్జి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *