Home > Editorial > బహిరంగంగానే నకిలీ మద్యం అమ్మకాలు లిక్కర్ మాఫియా పాత్రపై ఆరా

బహిరంగంగానే నకిలీ మద్యం అమ్మకాలు లిక్కర్ మాఫియా పాత్రపై ఆరా

తాత్కలిక భవనాల్లో కస్తూర్బాలు
ప్రతి అంశం రాజకీయమేనా...
 
alcohol_   apduniaఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో  మద్యం కల్తీ చేసి విక్రయించడం సర్వసాధారణమైంది.. మద్యాన్ని కల్తీ చేసేవారు కొందరైతే… నకిలీ మద్యాన్ని అమ్మే వారు మరికొందరు… ఏదో ఎంజాయ్్మెంట్ కోసం, బాధను, కష్టాల్ని మర్చిపోవడం కోసం తాగుతున్న వారు కాస్త  రోగాల బారిన పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు… నకిలీ మద్యాన్ని దర్జాగా వైన్స్ షాపుల్లో విక్రయిస్తూ ఎక్సైజ్ అధికారులకు దొరకడం సంచలనం సృష్టిస్తోంది… ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని పలుప్రాంతాల్లో లిక్కర్ మాఫియా బహిరంగంగానే నకిలీ మద్యం అమ్మకాలు చేపట్టింది… ఇక మద్యం ప్రియులకు మాత్రం ఏది అసలుదో, ఏది నకిలీదో తెలియడం లేదు..  జిల్లాల్లో ప్రధానంగా వైన్ షాపులన్ని దాదాపు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు సంబంధించిన వారే నిర్వహిస్తున్నారు.. దీంతో అధికారయంత్రాంగం చూసిచూడనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి.మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి  పట్టణంలోని రెండు వైన్ షాపుల్లో  కల్తీ మధ్యం విక్ర‌యిస్తూ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ప‌ట్టుబ‌డ‌టం ఆపై ఎక్సైజ్ శాఖ రెండు వైన్ షాపుల‌కు 25 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు అప‌రాధ రుసుం వేయ‌డం కోల్ బెల్ట్ ఏరియాలో చ‌ర్చ‌నీయాంశం అయింది.. ప్ర‌భుత్వం వేసిన అప‌రాధ రుసుం భారీగా ఉన్న‌ప్ప‌టికీ వైన్ షాపు నిర్వాహ‌కులు  ఫైన్ క‌ట్టి వెంట‌నే షాపులు తెరిచారు.. బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలో రాష్ట్ర ఉన్నతాధికారుల‌కు అందిన ఫిర్యాదు ఆధారంగా త‌నిఖీ చేస్తే న‌కిలీ మ‌ధ్యం ప‌ట్టుబ‌డింది.. మ‌రి ఇలాంటివి జిల్లాలో కోకొల్ల‌లు అని మందుబాబులు ఆరోపిస్తున్నారు.. గ‌తంలోను  బ్రాండెడ్ మద్యం బాటిల్లో సగం నీళ్లను, సగం మందును నింపుతుండగా ఎక్సైజ్ అధికారులు దాడి చేసి పట్టుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి..  వైన్ షాపు నిర్వాహకులు ఏకంగా షాపులోనే అక్రమదందాకు స్వీకారం చుట్టారు… ఫుల్ బాటిళ్లలో క్యాన్ల ద్వార తెచ్చుకున్న నీళ్లను నింపి ఖాళీ సీసాల్లో మళ్లీ సగం నీళ్లు, మందును నింపి ఎవరికీ అనుమానం రాకుండా సీజ్ చేస్తున్నారు…  ఆఫీసర్స్ ఛాయిస్, ఒర్జినల్ ఛాయిస్, ఇంపీరియల్ బ్లూ, రాయల్ స్టాగ్, మెగడొవల్, అరిస్ట్రోకాట్ ఏసీప్రీమియం, బ్రాండ్లకు చెందిన ఫుల్్బాటిళ్లన కల్తీ చేస్తూ గ‌తంలో   పట్టుబడ్డారు.. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో అక్రమార్కులు పట్టణ ప్రాంతాల్లో కొత్తతరహా దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది.. ఎవ‌రికీ అనుమానం రాకుండా ఫుల్ బాటిల్ మూత‌ల్ని చాక‌చ‌క్యంగా తెరిచి దానిలో ఉన్న ఒర్జిన‌ల్ మందును స‌గం తీసి మిగ‌తా స‌గం త‌క్కువ ద‌ర మ‌ద్యం కానీ, నీళ్లు కాని నింపుతూ అక్ర‌మార్కులు కోట్లు గ‌డిస్తున్నారు.. ఇక అర్ధ‌రాత్రి వ‌ర‌కు న‌డిచే బార్ల‌లో కూడా న‌కిలీ మ‌ద్యం విక్ర‌యించి సొమ్ము చేసుకుంటున్న‌ప్ప‌టికీ ఎక్సైజ్ అధికారులకు నెల నెలా మామూళ్లు అందుతుండ‌టంతో బార్ల‌వైపు క‌న్నెత్తి చూడ‌టం లేద‌నే ఆరోప‌ణ‌లు స‌ర్వ‌త్రా ఉన్నాయి.నకిలీ మద్యానికి సంబంధించిన మూతలు, లేబుల్ళు, స్టిక్కర్లు  త‌యారు చేసుకుని కొంద‌రు న‌కిలీ మ‌ద్యాన్ని బెల్ట్ షాపుల్లో ఎవ‌రికీ అనుమానం రాకుండా విక్ర‌యిస్తున్నార‌ని స‌మాచారం..  నకిలీ మద్యాన్ని తక్కువ మొత్తంలో వైన్్్షాపులకు సరఫరా అవుతుంటే భారీగా బెల్ట్ షాపులకు రవాణా అవుతోంది…. బెల్ట్ 
షాపుల్లో ఎట్టిపరిస్థితుల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు ఉండవు.. దీన్ని ఆసరగా చేసుకున్న అక్రమార్కులు నకిలీ మద్యాన్ని తయారు చేసి బహిరంగ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటూ సామాన్యుల ఆరోగ్యంతో  ఆటలాడుకుంటున్నారు.. మరోవైపు నకిలీ మద్యం కారణంగా ప్రభుత్వ ఆదాయానికి కూడా పెద్ద ఎత్తున గండి పడుతోంది….  రెక్టిఫైడ్ స్పిరిట్్్తో కలిపి చీఫ్ లిక్కర్ ను ఎక్కువ ధర ఉండే బ్రాండ్ బాటిళ్లలో మద్యాన్ని నింపుతున్నారు… గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది… అయితే ఈ నకిలీ మద్యం విషయం బయటకు రావడంతో మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు….  జిల్లాలో అత్యధికంగా వైన్ షాపుల్ని రాజకీయప్రముఖులే నిర్వహిస్తుండటంతో అక్రమార్కుల బండారం పూర్తిగా బయటకు వస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.. ఆదిలాబాద్, నిర్మ‌ల్, ఆసిఫాబాద్, మంచిర్యాల  జిల్లాలు  అంతా దాదాపు మహారాష్ట్రకు సరిహద్దున ఉంది… మహారాష్ట్రలోని ఆదివాసి జిల్లాల్లో మద్యనిషేధం అమలులో ఉంది… దీంతో ఇదే అదనుగా వ్యాపారులు నకిలీ మద్యాన్ని మహారాష్ట్రకు కూడా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు…. మంచిర్యాల జిల్లాలో కోట‌ప‌ల్లి, వేమ‌న‌ప‌ల్లి మండ‌లాల్లో  ప్రాణహిత సరిహద్దున బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యాన్ని  విక్ర‌యిస్తున్నారు..  మరోవైపు మహారాష్ట్ర నుంచి దేశీదారు కూడా అక్రమంగా రోడ్డు, రైళ్ల మార్గాల ద్వార జిల్లాకు చేరుతోంది… ఎక్సైజ్ డిపార్ట్ ్మెంట్లో పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు… దీంతో తక్కువ ధరకు దొరికే నాటుసారా, కల్తీమద్యం సేవించి మద్యం ప్రియులు అనారోగ్యానికి గురవుతున్నారు… కాగజ్్నగర్, ఆసిఫాబాద్, భైంసా, ఆదిలాబాద్ , ఊట్నూర్ ప్రాంతాల్లో దేశీదారు, మంచిర్యాల, నిర్మల్, బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూర్ ప్రాంతాల్లో కల్తీమద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది…. పేదలు, మద్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే బ్రాండ్్లను కల్తీ చేస్తున్నారు… లైసెన్స్ ఫీజు ధరలు బాగా పెరగడం, ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో వ్యాపారులకు నామమాత్రపు లాభాలే వస్తున్నాయి.. .. అయితే తక్కువ కాలంలో రెట్టింపు లాభాలకోసం కొందరు వ్యాపారులు వక్రమార్గాలను ఎంచుకుని ప్రజారోగ్యంతో ఆటలాడు 
కుంటున్నారు.. ఇకనైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి దేశీదారు, కల్తీమద్యం రవాణాను అరికట్టి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com