Home > Tirumala News > నెలరోజులపాటు పుష్కరిణీ మూసివేత

నెలరోజులపాటు పుష్కరిణీ మూసివేత

ఆగస్టు 7 మధ్యాహ్నం నుంచి శ్రీ వారి ఆలయం మూసివేత
పవిత్రోత్సవాలకు అంకురార్పణం

Pushkarini4_apduniaతిరుమలలో శ్రీవారి పుష్కరిణిని 30 రోజుల పాటు మూసి వేశారు. ప్రతీ ఏటా నిర్వహించే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు నెలలో ప్రారంభం కానున్నాయి. దీంతో గత కొద్దిరోజులుగా పుష్కరిణీ శుద్దీ, మరమ్మత్తుల పనులు టీ.టీ.డీ చేపట్టింది. వచ్చేది స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కావడంతో, చివరి రోజు ఉత్సమూర్తులు, స్వామి వారి సుదర్శన చక్రంకు ఆలయం అర్చకులు పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. లక్షలాధి మంది భక్తులు సైతం అదే సమయంలో పుష్కరిణిలో దిగి స్నానాలు ఆచరించి, తమ పాపపరిహారం చేసుకోనున్నారు. ఇందు కోసం పుష్కరిణీని అన్ని హంగులతో ముస్తాబు చేస్తున్నారు. పురాణాల ప్రకారం వైకుంఠం నుండి స్వామి వారు వచ్చి ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించేవారని భక్తుల విశ్వాసం. కుమారస్వామి అసుర సంహారం తర్వాత ఇక్కడే స్నానం చేశారని, పరుశరాముడు తన పాతకాన్ని పోగోట్టుకోవడానికి ఇక్కడ కొంతకాలం ఉన్నారని, రకరకాల కధలు ప్రచారంలో ఉన్నాయి. మరో వైపు ఈ పుష్కరిణిలో 3కోట్ల తీర్ధాలు నిత్యనివాసం ఉంటాయని, ఇందులో స్నానాలు చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. పురాణాల సంగతి ఇలా ఉంటే …. ఇటీవల నేషనల్ రిమోట్ సెన్సింగ్ , గాధంకి వారు శాటిలైట్ ద్వారా తిరుమల పుష్కరిణిని పరిశీలించారు. ఇక్కడ దాదాపుగా 50వేల తీర్ధాలు వివిద దిక్కుల నుంచి కలుస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని టీటీడీ అధికార్ల దృష్టికి తీసుకెళ్ళారు. మరోవైపు ఆయుర్వేద వైద్యులు ఇక్కడి పుష్కరిణిలో తిరుమల అడవుల్లోని వివిద మూలికల ఆనవాల్లు ఉన్నట్టు చెపుతున్నారు. ఈ నీటిలో స్నానం చేయటం వల్ల సకల పాపాలు పోయి జన్మ సార్థకత అవుతుందని అంటున్నారు శ్రీవారి ఆలయం అర్చకులు రమణదీక్షితులు. తిరుమల వచ్చే భక్తులు స్వామి వారిని దర్శించే ముందు పుష్కరిణిలో స్నానాలు చేయడం పరిపాటి. అనంతరం శ్రీవారి దర్శనానికి వెలుతుంటారు. ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపద్యంలోనే శుద్ది చేయడం కోసం తాత్కాలికంగా ఒక్క నెలపాటు పుష్కరిణిని మూసివేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే రిపేర్లు, డెకరేషన్, పలు హంగులతో మార్పు చేర్పులు చేయనున్నారు.  టీటీడీ లో అన్ని విభాగాల వారు తమ పనులు పూర్తి చేసిన తర్వాత, వేదమంత్రాల నడుమ పూజారులు శుద్ది కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత భక్తులను పవిత్రస్నానాలకి అనుమతిస్తారు. ఇవన్నీ పూర్తి కావడానికి సుమారు 25 రోజుల నుంచి నెల పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *