Home > Health > గురక ఇబ్బంది పెడుతోందా..అయితే ఇలా చేయండి

గురక ఇబ్బంది పెడుతోందా..అయితే ఇలా చేయండి

చెన్నైకు ఈగల భయం
నోటికి మరియు ఆరోగ్యానికి సంబంధం ఏమిటి?

snoring_apduniaప్రశాంతమైన నిద్రను గురక దూరం చేస్తుంది. గురక తీసే వ్యక్తికి కాదు.. ఆయన చుట్టూ ఉండే వారికి నిద్రాభంగం కలుగుతుంది. స్థూలకాయం, సైనుసైటిస్ మలబద్ధకం, ఆస్తమా, వాతావరణ మార్పులు, మానసిక ఒత్తిడి వంటివి ఉన్నపుడు గురకపెట్టడం జరుగుతుంది. మద్యపానం, ధూమపానం చేసేవారిలో కూడా గురక పెట్టే అలవాటు ఉంటుంది. గురకతో పక్కవారికి ఇబ్బంది మాటెలా ఉన్నప్పటికీ దీనివల్ల గుండెపరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. సాధారణంగా నిద్ర అనేది ప్రశాంతతను ఇస్తుంది. ఆయువును పెంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందిస్తుంది. అలాంటి నిద్రకు విపరీతమైన భంగం కలిగించే గురక గురించి తెలుసుకోండి. గురక తగ్గించాలంటే..

* అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, తేనె కలిపి రాత్రి నిద్రించే ముందు తాగినట్లైతే మంచి ఫలితం కనబడుతుంది.
* రాత్రి నిద్రించే ముందు మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి.
* ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *