Home > Politics > మోడి అంటే హడలిపోతున్నారు : పీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి

మోడి అంటే హడలిపోతున్నారు : పీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి

ఓటు హక్కుపై అవగాహన వుండాలి : గవర్నర్ నరసింహన్
మోత్కుపల్లిపై వేటుకు రంగం సిద్ధం

raghuveera-reddy-apduniaప్రతిపక్షం లో ఉన్న వైకాపా కూడా అధికార పక్షం లో ఉన్నట్లు జగన్ వ్యాఖ్యలతో తేలిపోయిందని ఏపీసీసీ ఛీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. బీజేపీ ముందు జగన్ సాగిల పడ్డారు. మోడీ అంటే బాబు, జగన్ హడలి పోతున్నారు. మోడీ కాళ్ళ కింద ఇద్దరు నలిగిపోతున్నారని మండిపడ్డారు. హోదా ఇవ్వమన్న మోడీ కోసమే టీడీపీ, వైసీపీ లు ఉరుకులు పెడుతున్నాయని అన్నారు.

కేవలం స్వప్రయోజనాల కోసమే ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రత్యేక హోదా ఇస్తామంటే మీతో పొత్తుకు సిద్ధమంటున్నారు.  అధికార పార్టీ విభజన హామీల అమలుకు సుప్రీమ్ కోర్టుకు వెళ్తామన్నారు. జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరూ మోడీ తొత్తులుగా మారిపోయినారని విమర్శించారు. ప్రతిపక్షానికి అధికార పక్షానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానిని కలిసాక ఆయన ఇచ్చిన హామీల సంగతి చంద్రబాబు చెప్పనే చెప్పరని అన్నారు.

హోదా విషయంలో నాలుగేళ్ల తరువాత కోర్టు కు వెళ్లడం హాస్యాస్పదం. ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని కంపెనీలు తెచ్చారు. మీరు దోచుకున్న సొమ్మును విదేశంలో దాచుకోటానికి మీరు వెళ్తున్నారని అన్నారు. మీరు చేసే విదేశీ పర్యటనలు సరదా పర్యటనలే. ఎన్ని కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేశారు. ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు. 24 రోజులైనా కూడా గుంటూరు గొట్టిపాడు గ్రామ దళితులను సామాజిక భద్రత కల్పించలేక పోయారు. కనీసం మీడియా ను కూడా కవరేజ్ అనుమతించ లేదని అన్నారు. కోడిపందాలు బాగా ఆడించారు. మీకు జెండా పండుగ జరుపుకునే నైతికత ఉందా అని ప్రశ్నించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి ఎక్కడో వాళ్ళ నాన్న గారి కుర్చీ లాక్కున్నారనే ఆలోచన ఉండి ఉండవచ్చు. బావ గారు విదేశీ పర్యటనలో ఉండగా మోజు తీర్చుకున్నట్లు ఉన్నారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ ఉండాలి. పక్షపాతం లేకుండా గవర్నర్ నరసింహన్ వ్యవహరించాలి. ఉమ్మడి గవర్నర్ ఉంటేనే రాష్ట్ర విభజన ప్రయోజనాలు నెరవేరుతాయని రఘువీరా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *